గురువారం 22 అక్టోబర్ 2020
Wanaparthy - Oct 18, 2020 , 01:02:41

నీట మునిగిన పంటలను రక్షించుకోండి

నీట మునిగిన పంటలను రక్షించుకోండి

వనపర్తి అర్బన్‌ : ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన వరి పంటను రక్షించుకొని రైతులు నష్టాల బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే పంట చేతి కొస్తుందని వ్యవసాయశాఖ జిల్లా అదనపు డైరెక్టర్‌  సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అన్ని పంటలు నీట మునిగాయన్నారు. ముఖ్యంగా ఎక్కువగా సాగు అవుతున్న వరిని కాపాడుకునేందుకు రైతులు సూచనలు తీసుకోవాలని సూచించారు. వరిమడిలో ఉన్న నీటిని వెంటనే బయటకు పంపాలి, దుబ్బులను కట్టలుకట్టి లీటర్‌ నీటిలో 50 గ్రాముల ఉప్పును కలిపి పిచికారీ చేయాలన్నారు. చిరుపొట్ట పూత దశలో ఉన్న వరి పైరుపై పొట్టకుళ్లు, బూజుతెగుళ్ల నివారణకు ఒక గ్రాం కార్బండెజమ్‌ లేక రెండు గ్రాముల కార్బండెజమ్‌తో పాటు మాంకోజెబ్‌ ఒక లీటర్‌ నీటిలో కలిపి పది రోజులకొకసారి రెండు సార్లు పిచికారీ చేసి రైతులు తమ పంటను కాపాడుకోవాలని సూచించారు.


logo