గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Oct 17, 2020 , 04:52:27

సత్వర సేవలకే అంబులెన్స్‌

సత్వర సేవలకే అంబులెన్స్‌

  • వనపర్తి దవాఖానలో అంబులెన్స్‌ ప్రారంభం
  • లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి అర్బన్‌ : అత్యవసర సమయంలో రోగులకు సత్వరమే వైద్యసేవలు అందించేందుకు అత్యాధునిక అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా దవాఖానలో మంత్రి సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన అం బులెన్స్‌ను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ప్రముఖ ప్రజాప్రతినిధులు గిఫ్ట్‌ ఏ స్మైల్‌ పిలుపుతో అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా అంబులెన్స్‌లు ఉచితంగా ఇచ్చేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ముందు కొచ్చారన్నారు. వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ వంటి సదుపాయాలతో కూడిన అంబులెన్స్‌ను అందజేస్తున్నట్లు తెలిపారు. 

పల్లెల అభివృద్ధికే రోడ్ల నిర్మాణం

వనపర్తి రూరల్‌ : మారుమూల గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం చేపడుతున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దగూడెం నుంచి కిష్టగిరి వరకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దగూడెంలోని ప్రకృతివనాన్ని ప్రారంభించి మాట్లాడారు. గతంలో మారుమూల పల్లెలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవని, సాధారణంగా ఆయా గ్రామాలకు వెళ్లాలంటే రాళ్లు తేలిన రోడ్లపైనే వెళ్లాల్సి వచ్చేదని, అలాంటి పరిస్థితుల నుంచి స్వరాష్ట్రం వచ్చాక తెలంగాణ ప్రభుత్వం ప్రగతి మార్గాలపై దృష్టి సారించిందన్నారు. నియోజకవర్గంలోని మహిళలకు బతుకమ్మ, దసరా కానుకగా ప్రభుత్వం చీరెలను అందిస్తున్నదని, అలాగే ప్రతి మహిళకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 

గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ 

పెబ్బేరు: గ్రామాలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఓ ఫంక్షన్‌హాల్‌లో పెబ్బేరు, శ్రీరంగాపూర్‌ మండలాలకు చెందిన 82మంది లబ్ధిదారులకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డితో కలిసి మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నదన్నారు. గ్రామాల్లో కూరగాయల సాగును ప్రతిఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు. 

నెంబర్‌వన్‌ జిల్లాగా చేసి చూపిస్తా..

పెద్దమందడి: రాబోయే రోజుల్లో వనపర్తి జిల్లాను వ్యవసాయరంగంలో దేశంలోనే నెంబర్‌వన్‌ జిల్లాగా చేసి చూపిస్తానని  మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దొడగుంటపల్లిలో చిన్నమందడి క్రాస్‌రోడ్డు నుంచి పెద్దమందడి వరకు రూ.2.90కోట్లతో చేపట్టిన బీటీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం కోసం ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రోడ్లను బీటీ రోడ్లుగా మారుస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడైనా సరే వ్యవసాయరంగంలో ఉత్తమ జిల్లా ఏది అంటే వనపర్తి అనేటట్లు చూపిస్తానన్నారు. ప్రతి రైతు సాగుచేసే పంటలతోపాటు కూరగాయల సాగు చేయాలని అన్నారు. పార్కులు నగరాలకు, పట్టణాలకే పరిమితమయ్యేవని, కానీ గ్రామగ్రామాన పార్కులు ఏర్పాటు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో నూతన పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా నాటిన మొక్కలు 85శాతం సంరక్షించేలా చూడాల్సిన బాధ్యత సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులపై పెట్టడం జరిగిందన్నారు. నేడు రాష్ట్రంలో 97శాతం డెంగీ జ్వరాలు తగ్గాయన్నారు. జ్వరాలు తగ్గడానికి కారణం గ్రామాల్లో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేయించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతోనే సాధ్యమైందన్నారు. మండలంలోని 27మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి అందజేశారు. గ్రామంలోని పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించారు. 

రైతు వేదికలు కర్షక దేవాలయాలు

గోపాల్‌పేట : అన్నం పెట్టే రైతులకు ఆత్మగౌరవం ఇచ్చే వేదికలు రైతు వేదికలని, ఇవి కర్షక దేవాలయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బుద్దారం-వెంకాటాపురం వరకు రూ.కోటీ 77లక్షల 45వేల ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన నిధులతో నిర్మించతలపెట్టిన 3.2 కిలోమీటర్ల బీటీరోడ్డు పనులకు మంత్రి జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గోపాల్‌పేట, రేవల్లి మండలంలోని 81మంది లబ్ధిదారులకు  కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో 2,601 రైతు వేదికల నిర్మిస్తున్నామని, పనులు త్వరగా పూర్తిచేసి దసరాకు ప్రారంభించుకుందామన్నారు. రవాణా సదుపాయం మరింత మెరుగుపరిచేందుకు బుద్దారం నుంచి పాటిగడ్డ తండా మీదుగా వెంకటాపురం వరకు బీటీరోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు మంజూరుపై సీఎం కేసీఆర్‌కు, పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, సూపరింటెండెంట్‌ హరీశ్‌, ఆర్‌ఎంవో చైతన్యగౌడ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పలుస రమేశ్‌గౌడ్‌, నాయకులు లక్ష్మయ్య, బీచుపల్లియాదవ్‌, జాతృనాయక్‌, జేసీ వేణుగోపాల్‌, డీపీవో రాజేశ్వరి, ఇన్‌చార్జి డీఆర్డీవో కోదండరాములు, ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్దగూడెం సర్పంచ్‌ కొండన్న, జెడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ ఉస్మాన్‌, ఉపసర్పంచ్‌ భాస్కర్‌గౌడ్‌, మార్కెట్‌యార్డు చైర్మన్‌ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ ధర్మానాయక్‌, పెబ్బేరు తాసిల్దార్‌ ఘూన్సీరాం నాయక్‌, ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణశ్రీ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ శ్యామల, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గౌని బుచ్చారెడ్డి, వైస్‌ ఎంపీపీ బాలచంద్రారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ గౌని కోదండరాంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ కర్రెస్వామి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు వనం రాములు, హరిశంకర్‌ నాయుడు, సర్పంచులు గోవిందునాయుడు, రవీందర్‌నాయుడు, భారతి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ మెగారెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, తాసిల్దార్‌ సుజాత, ఎంపీడీవో అప్జల్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజప్రకాష్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి,  సర్పంచ్‌ వరలక్ష్మి, ఎంపీటీసీ భార్గవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వేణు, ఆర్డీవో అమరేందర్‌, తాసిల్దార్లు నరేంద ర్‌, శ్రీరాములు, ఎంపీడీవో కరుణశ్రీ, పీఆర్‌ ఎస్‌ఈ శివకుమార్‌, డీఈ అశోక్‌, ఏఈ రాజేశ్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మ న్‌ హర్యానాయక్‌, జెడ్పీటీసీలు భార్గవి, భీమయ్య, ఎంపీపీలు సంధ్య, సేనాపతి, వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌, పీఏసీసీఎస్‌ అధ్యక్షుడు రఘు, వైస్‌ చైర్మన్‌ రాములు, రైతు బం ధు మండల అధ్యక్షుడు తిరుపతియాదవ్‌, పార్టీ మండల అధ్యక్షుడు బాలరాజు, నాయకులు కోటీశ్వర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.