శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Oct 16, 2020 , 05:55:52

దసరా కానుకగా బతుకమ్మ చీరెల పంపిణీ

దసరా కానుకగా బతుకమ్మ చీరెల పంపిణీ

  • మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ 

వనపర్తి : దసరా కానుకగా సీఎం కేసీఆర్‌ మహిళలకు బతుకమ్మ చీరెలను ఇస్తున్నారని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాసపురంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, వార్డు కౌన్సిలర్‌ విభూ తి నారాయణతో కలిసి మహిళలకు చీరెలను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో వార్డు మహిళలు, నాయకులు ఉన్నారు. 

పిన్నెంచెర్లలో..

ఆత్మకూరు : మండలంలోని పిన్నెంచెర్లలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసులు ముఖ్యఅతిథి గా హాజరై మహిళలకు చీరెలను అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దసరా పండుగకు ఆడపడుచులకు సర్కారు కానుకగా చీరెలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం లో మహిళలందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ కోరికని వైస్‌ ఎంపీపీ కోటేశ్వర్‌ చెప్పారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్‌, సర్పంచ్‌ విజయలక్ష్మిగౌడ్‌, రైతుబంధు సమితి నాయకుడు వీరేశలింగం, నాయకులు మశ్చందర్‌గౌడ్‌, భాస్కర్‌, మాసన్న, మాజీ సర్పంచ్‌ వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

మదనాపురంలో..

మదనాపురం : మహిళలకు ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎంపీపీ జన్ను, పద్మావతి ఆధ్వర్యంలో జోరుగా కొనసాగుతున్నది. గురువారం మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో జెడ్పీటీసీ కృష్ణయ్య, టీఆర్‌ఎస్‌ మహిళా మండలాధ్యక్షురాలు అనురాధ, సర్పంచ్‌ టీకే శారదతో కలిసి ఎంపీపీ మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సరస్వతి, ఉప సర్పంచ్‌ పావని, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు సాయిలు, ప్రచార కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, గ్రామాధ్యక్షుడు చిన్నరాములు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ తిరుపతయ్య, సింగిల్‌ విండో డైరెక్టర్‌ నాగేంద్రం, నాయకులు హన్మంతు, రవికుమార్‌, నాగశేషన్న, మాసన్న, శివరాములు, ఐకేపీ అధ్యక్షురాలు రేణుక, మహిళలు పాల్గొన్నారు.