శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Oct 10, 2020 , 01:08:01

ప్రపంచ విప్లవ ధ్రువతార చేగువేరా

ప్రపంచ విప్లవ ధ్రువతార చేగువేరా

వనపర్తి టౌన్‌ : ప్రపంచ వేగుచుక్క, ధ్రువతార చేగువేరా అని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గణేశ్‌, టీజేఏసీ రాజరాంప్రకాశ్‌ అన్నారు. శుక్రవారం పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో చేగువేరా వర్ధంతిని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కవిపండితులు గిరిరాజయ్యచారి, వ్యాఖ్యత నరసింహశర్మ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు వెంకటస్వామి, డప్పు నాగరాజు, ఈశ్వర్‌, పీడీఎస్‌యూ నాయకులు పవన్‌, చందు, మహేశ్‌ ఉన్నారు. 

అమరచింతలో ..

ఆత్మకూరు : మండల కేంద్రం అమరచింతలో చేగువేర వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌వై), భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ)ల ఆధ్వర్యంలో స్థానికంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటుచేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకుడు వెంకటేశ్‌ మాట్లాడుతూ చేగువేర చేసిన సాహసాలు, ప్రజా ఉద్యమాలను గుర్తుచేసుకున్నారు. చేగువేర స్ఫూర్తిగా నేటి యువత ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో హరీశ్‌, తౌఫీక్‌, శ్రీకాంత్‌, రాము, లోకం, విష్ణు, ఇస్మాయిల్‌ పాల్గొన్నారు.