మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 10, 2020 , 01:08:03

ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం కానుక

ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం కానుక

  • జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి

వనపర్తి రూరల్‌ : తెలంగాణ ప్రభుత్వం దసరా, బతుకమ్మ పండుగలకు కానుకగానే కాక నేతన్నల బతుకులలో వెలుగు నింపేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని అంకూర్‌ గ్రామంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ కిచ్చారెడ్డితో కలిసి జెడ్పీ చైర్మన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా  చైర్మన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఆడపడుచులకు ఈ చీరెలను పంపిణీ చేయడం చా లా సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరి బతుకమ్మ చీరెలను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, రేషన్‌ డీలర్ల మనోహర్‌శెట్టి, మహిళ సంఘం గ్రామ నాయకురాలు, మహిళలు  తదితరులు పాల్గొన్నారు.