శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Oct 10, 2020 , 01:08:03

వీఆర్‌వోగా విధులు నిర్వహిస్తూనే.. జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం

వీఆర్‌వోగా విధులు నిర్వహిస్తూనే.. జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం

వీపనగండ్ల : మండలంలోని కల్వరాల గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు బత్తుల చిన్నయ్య, పద్మ దంపతులకు చెందిన ద్వీతీయ కూతురు మాధూరి వీఆర్‌వో విధులు నిర్వహిస్తూనే.. గ్రూప్‌-4 పరీక్షలో ప్రతిభను చాటి హోంశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించడంపై పలువురు అభినందించారు. ఈ సందర్భంగా మాధూరి  మాట్లాడుతూ 2019 జూలైలో వీఆర్‌వో ఉద్యోగం సాధించి, చిన్నంబావి మండలంలోని కొప్పునూర్‌ గ్రామంలో వీఆర్‌వోగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్‌-4లో ప్రతిభను చాటి హోంశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించడంపై సంతోషంగా ఉందన్నారు.