శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Oct 06, 2020 , 03:28:10

ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు ప్రారంభం

ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు ప్రారంభం

వనపర్తి విద్యావిభాగం : జిల్లాకేంద్రంలోని పురుషుల డిగ్రీ కళాశాలలో సోమవారం ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్ష  కేంద్రా న్ని ప్రిన్సిపాల్‌ చందోజీరావు పర్యవేక్షించి మాట్లాడారు. మొత్తం 102 మం ది విద్యార్థులకుగానూ 97 మంది విద్యార్థులు హాజరుకాగా ఐదుగురు గైర్హాజరైనట్లు తెలిపారు. చివరి సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 10 వరకు కొనసాగుతాయని, ఈ నెల 11 నుంచి 5వ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయ ని ఆయన తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షకు హాజరుకావాలని ఆయన సూచించారు. కొవిడ్‌-19 నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.