బుధవారం 02 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 06, 2020 , 03:28:15

నులిపురుగుల నివారణకు కృషి చేద్దాం

నులిపురుగుల నివారణకు కృషి చేద్దాం

  • డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీనివాసులు

వనపర్తి అర్బన్‌ : జిల్లాలో నులిపురుగుల నివారణకు ఐక్యంగా కృషి చేద్దామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జిల్లాలో సోమవారం నుంచి 12వ తేదీ వరకు కొనసాగుతుందని, ఈ కార్యక్రమం మొదటి సారి ఇంటింటికీ వెళ్లి 19 సంవత్సరాల లోపు వారికి విధిగా ఆల్బెండజోల్‌ మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో గుర్తించిన 1,32,314మంది పిల్లలకు గానూ మొదటి రోజు 31,634 మందికి పిల్లలకు మాత్రలు వేసినట్లు తెలిపారు. కొవిడ్‌-19 ప్రొటోకాల్‌ విధిగా పాటించి పలు జాగ్రత్తలతో నులిపురుగుల నివారణ మాత్రలు ఇంటింటికీ తిరిగి వేయించామన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు 154 మంది, అంగన్‌వాడీ కార్యకర్తలు 558 మంది పాల్గొన్నట్లు తెలిపారు.  పట్టణంలోని 33వ వార్డు వల్లభ్‌నగర్‌లో అంగన్‌వాడీ కేంద్రం నిర్వాహకులు పద్మ ఇంటింటికీ వెళ్లి ఆల్బెండజోల్‌ మాత్రలు వేశారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్త జయమ్మ, పోషణ్‌ అభియాన్‌ టీం సభ్యులు వనజ, కృష్ణవేణి పాల్గొన్నారు.