ఆదివారం 06 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 04, 2020 , 01:43:17

నేడు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి జన్మదినం

నేడు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి జన్మదినం

  • ఉద్యమ నాయకుడి అడుగుజాడల్లో సింగిరెడ్డి పయనం
  • న్యాయవాద వృత్తిని వీడి స్వరాష్ట్ర సాధన వైపు..
  • ప్రత్యేక రాష్ట్ర సాధనలో తనదైన ముద్ర
  • వనపర్తిలో బీడుబారిన పొలాలకు సాగునీరందించిన ఘనత
  • ‘నీళ్ల నిరంజనుడి’గా ప్రజల పిలుపు

మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌ అడుగు జాడల్లో నడుస్తూ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడంలో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తనదైన పాత్ర పోషించారు.. రాముడి వెంట లక్ష్మణుడిలా కష్టనష్టాల్లో 14 ఏండ్ల పాటు ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ వెంట నడిచి గమ్యాన్ని ముద్దాడారు.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని  ఉద్యమ నాయకుడిగా.., న్యాయవాద వృత్తిలో లెజండ్‌గా.., బీడుబారిన పంట పొలాలకు నీళ్లు అందించి.. ప్రజల హృదయాల్లో నీళ్ల నిరంజనుడిగా స్థానం సంపాదించారు.. ఈ క్రమంలో నేడు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం..

- వనపర్తి, నమస్తే తెలంగాణ


2001లో తెలంగాణ ప్రదాత కేసీఆర్‌ ప్రారంభించిన మలిదశ ఉద్యమంలో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఉద్యమ స్ఫూర్తిని భుజాన వేసుకుని కీలకనేతగా ముందుకు సాగారు. సమైక్య రాష్ట్రంలో ఒక పక్క టీడీపీ, మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలు బలంగా ఉన్నాయి. ఆ పార్టీ నేతలు తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచాలని చూస్తూ అక్రమ కేసులు పెట్టి ప్రజలను వేదింపులకు గురిచేశారు. ఈ తరుణంలో నిరంజన్‌రెడ్డి పాలమూరు బీడుబారిన భూములను, వలస బాధలను బలంగా వినిపించి ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ అభివృద్ధిలో ప్రస్తుతం కీలకపాత్ర వహిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర అనంతరం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, వ్యవసాయశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తూ అనుక్షణం రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు.  

నిరంజన్‌రెడ్డి బాల్యం, విద్యార్థి దశ..

సింగిరెడ్డి రాంరెడ్డి, తారకమ్మ దంపతులకు 1958 అక్టోబర్‌ 4వ తేదీన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జన్మించారు. నాగర్‌కర్నూల్‌ పరిధిలోని యత్మతాపూర్‌ స్వగ్రామం అయినప్పటికీ.. నిరంజన్‌రెడ్డి తల్లిదండ్రులు పాన్‌గల్‌లో స్థిరపడ్డారు. పాన్‌గల్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనే 1 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. వనపర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ వరకు చదివారు. 1977 నుంచి 1980 వరకు సికింద్రాబాద్‌లోని సర్ధార్‌ పటేల్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీని పూర్తి చేశారు. 1981 నుంచి 1984 వరకు ఔరంగాబాద్‌కు చెందిన మరాడ్‌వాడ యూనివర్సిటీ పరిధిలోని యశ్వంత్‌ లా కళాశాలలో లా డిగ్రీ పూర్తి చేశారు. బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు ఉన్న నిరంజన్‌రెడ్డి పదో తరగతిలోనే హైస్కూల్‌ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. 

డిగ్రీ చదువుతున్నప్పుడు వామపక్ష విద్యార్థి సంఘంలో చేరి క్రియాశీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌లోనే ఉంటూ విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. లెక్చరర్లతో రాజకీయాలు, చరిత్ర వంటి అంశాలను చర్చించేవారు. 

రాజకీయ రంగంలోకి అడుగులు..

న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే టీడీపీ లో చేరి రాజకీయ రంగంలో ప్రవేశించిన నిరంజన్‌రెడ్డి.. అందులో ఇంటర్నల్‌ కోర్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి కోర్‌ కమిటీగా ఉన్న ఐదుగురు సభ్యుల్లో నిరంజన్‌రెడ్డి ఒకరు. 1999 నుంచి 2000 వరకు (18 నెలలు) ఖాదీ బోర్డు చైర్మన్‌గా పని చేశారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచే కేసీఆర్‌తో సానిహి త్యం ఉండేది. కేసీఆర్‌ పార్టీకి.., పదవులకు రాజీనామా చేసి ఉద్యమబాట పట్టడంతో ఆయన వెం టే నిరంజన్‌డ్డి నడిచారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రజలకు వివరిస్తూ కేసీఆర్‌ వెంట ఉండి ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. 

ఉద్యమంలో తనదైన ముద్ర..

నిర్విరామ ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని నమ్మిన కేసీఆర్‌  2001లో మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీడీపీని వీడిన నిరంజన్‌రెడ్డి.. 2000లో ఏడాది పాటు జరిగిన తెలంగాణ మహాసభ, జనసభల్లో పాల్గొన్నారు. న్యాయవాదిగా ప్ర జల్లో మంచి పేరున్న సమయంలోనే.. ఆ వృత్తిని వీడి ఎటువంటి పదవులూ ఆశించకుండా కేసీఆర్‌ తో కలిసి ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. ఉ ద్యమ ప్రారంభ సమయంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌, ఉద్యమనేత కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉ ద్యమ తీరు తెన్నులపై చర్చించే ఆరుగురి కీలక వ్యక్తుల్లో నిరంజన్‌రెడ్డి ఒకరుగా ఉన్నారు. 2009లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా కేసీఆర్‌ గెలుపులో బాధ్యత పంచుకున్నారు. 

నీళ్ల నిరంజనుడిగా ప్రజల మన్ననలు..

ఉమ్మడి రాష్ట్రంలో కరువు నేలగా మారిన పాలమూరులో జలకళ సంతరించుకునేందుకు నిరంజన్‌ రెడ్డి కృషి చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాలో ఎంజీకేఎల్‌ఐ ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించడంలో ఆయన కృషి ఎ నలేనిది. ఏనాడూ వనపర్తి నియోజకవర్గానికి చు క్క సాగునీరు కూడా వచ్చిన సందర్భాలు లేవు. ప్రతి ఎకరానికి సాగునీరందించాలని కంకణం క ట్టకున్న నిరంజన్‌రెడ్డి ప్రణాలికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో చిన్ననీటి పారుదల ప్రాజెక్టులను ప్రోత్సహించారు. వనపర్తి జిల్లాలోని 1,250 చెరువులను మిషన్‌ కాకతీయ పథకం ద్వారా పటిష్టం చేసి ఎత్తిపోతల ద్వారా చెరువుల ను నింపారు. జిల్లాలో దాదాపుగా 50కి పైగా మి నీమోటర్లను ఏర్పాటు చేసి ప్రతి ఎకరాకూ సాగునీటిని అందించారు. దీంతో వనపర్తి ప్రజల మన్ననలు పొందినీళ్ల నిరంజనుడిగా పేరుగడించాడు.

అభివృద్ధిలో వనపర్తి దూకుడు..


ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, వ్యవసాయశాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. నూతన జిల్లాగా వనపర్తి ఆవిర్భవించడంలో నిరంజన్‌రెడ్డి పాత్ర ఎనలేనిది.   రాష్ట్రంలో నే తొలి వ్యవసాయ డిగ్రీ కళాశాలను పాలెంలో ఏ ర్పాటు చేయించారు. పెబ్బేర్‌లో తొలి మత్య్స శా ఖ డిగ్రీ కళాశాల ఏర్పాటులో ఎనలేని కృషి చేశారు. వనపర్తిలో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు తుది ద శకు చేరుకున్నది పట్టణ ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు తిరుమలయ్య గుట్టకు వెళ్లే దారిలో మర్రికుంట వద్ద ఎకోపార్కును ఏర్పాటు చేయించారు. కలెక్టరేట్‌, ఎస్పీ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలి మహిళా ఎస్సీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలతోపాటు కేజీబీవీ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయించారు. రాష్ట్రంలో మొట్టమొదటి హాకీ అకాడమీని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయించారు. వనపర్తి పట్టణంలో లో ఓల్టేజీ సమస్యను తీర్చడానికి అదనంగా నూతన సబ్‌స్టేషన్‌ ప్రారంభించారు. ఆక్రమణలకు గురైన నల్లకుంటను మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చుతున్నారు. ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో 30 పడకల దవాఖానను ఏర్పాటు చేశారు. తాజాగా రూ.300 కోట్లతో పెద్దమందడి మండలం బుగ్గతండా వద్ద, వనపర్తి పట్టణానికి తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.34.75 కోట్లతో మిషన్‌ భగీరథ ప్లాంట్లకు శంకుస్థాపనలు చేశారు. 

వకీల్‌గా తనదైన ముద్ర..

వకీల్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో వివిధ రకాల కేసుల పరిష్కారం కోసం వచ్చిన వారం తా నిరంజన్‌రెడ్డికి ఆత్మీయులుగా మారేవారు. న్యాయవాద వృత్తి ప్రారంభించిన రెండేండ్లలోనే 50 కేసుల పరిష్కారంలో చొరవ చూపాడు. జి ల్లా జడ్జీలు, ఇతర జడ్జీలు బదిలీపై వెళ్లేటప్పుడు న్యాయవాది వృత్తి చేపట్టే కొత్తవారికి నిరంజన్‌ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 1998లో జడ్జి అర్హత పరీక్షకు హాజరైన 1800 మందిలో అంతిమంగా ఐదుగురు ఎంపిక కాగా అందులో నిరంజన్‌రెడ్డి ఒకరు.