శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Oct 03, 2020 , 00:53:03

బాపూ బాటలో పయనిద్దాం

బాపూ బాటలో పయనిద్దాం

  • గాంధీజీ కలలుగన్న నాయకుడు సీఎం కేసీఆర్‌
  • నేడు పచ్చదనం- పారిశుధ్యంతో కళకళలాడుతున్న గ్రామాలు
  • మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • పెబ్బేరులో మున్సిపల్‌ కార్మికులకు పాదాభివందనం
  • వనపర్తిలో రూ.34.75 కోట్లతో భగీరథ పనులకు శంకుస్థాపన 

విశ్వం ఉన్నంత వరకు మానవజాతికి నిలువెత్తు నిదర్శనం మహాత్మా గాంధీజీ అని, ఆయన బాటలో అందరం పయనిద్దామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి, పెబ్బేరులో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలో  రూ.34.75 కోట్లతో మిషన్‌ భగీరథ పనులకు శంకుస్థాపన చేశారు. 

 పెబ్బేరు: విశ్వం ఉన్నంత వరకు మానవ జాతికి నిలువెత్తు నిదర్శనం మహాత్మా గాంధీజీ అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ అహింస బాటలో తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌ ప్రజలను చైతన్య పరిచి స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టారన్నారు. గాంధీజీ కలలుగన్న నాయకుడు సీఎం కేసీఆర్‌ అని తెలిపారు. మహాత్ముడు కలలుగన్న స్వరాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిందన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, పారిశుధ్యం, పరిశుభ్రత, డ్రైనేజీల వసతులు కల్పించడంతో ప్రజలకు నేడు 70 శాతం రోగాలు దూరమయ్యాయన్నారు. కరోనా సమయంలో వైద్య, పోలీస్‌, విద్యుత్తు, పంచాయతీ శాఖ, రెవెన్యూ, మున్సిపల్‌ కార్మికులు, జర్నలిస్టులను శాలువా, పూలమాలలతో సత్కరించారు. పారిశుధ్య కార్మికులకు పాదాభివందనం చేశారు.  గాంధీజీ జయంతి సందర్భంగా ప్రజలకు పూలు, పండ్లు, ఔషధ మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం గ్రంథాలయ ఆవరణలో  సామూహిక మరుగుదొడ్లను ప్రారంభించారు.

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు ఓటరు నమోదు చేసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని మంత్రి పారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, నాయకులు ఓటరు నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో చేపట్టాలని సూచించారు. పట్టభద్రులైన వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలన్నారు. పార్టీ అధిష్టానం బలపరిచిన అభ్యర్థుల విజయం కోసం సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు శైలజ, పద్మ, కర్రెస్వామి, బాలచంద్రారెడ్డి, శ్యామల, రామకృష్ణ, ఎల్లారెడ్డి, సుమిత్ర, పద్మ, భారతి, గోవిందు నాయుడు, ముస్తాక్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ బుచ్చారెడ్డి, విశ్వరూపం, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షుడు రాములు, శంకర్‌నాయుడు, కో ఆప్షన్‌ సభ్యుడు ముస్తాక్‌, నాయకులు సాయినాథ్‌, మేకల ఎల్లయ్య యాదవ్‌, భారతి, గోపాల్‌యాదవ్‌ పాల్గొన్నారు.

రూ .34.75 కోట్లతో  భగీరథ పనులకు శంకుస్థాపన 

వనపర్తి: మిషన్‌ భగీరథ నీళ్లతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్‌ కళాతోరణం ఆవరణలో రూ 34.75 కోట్లతో మిషన్‌ భగీరథ నీళ్లు అందించే పనులకు కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాష, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌,  మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, నాయకులతో కలిసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెత్తను రీ సైక్లింగ్‌ చేసేందుకు గ్రామ పంచాయతీల్లో తడి,పొడి చెత్త కేంద్రాలు నిర్మించామన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీలు, ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.   కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌,వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌,  ఎన్‌ఆర్‌ఐ యూత్‌ ప్రెసిడెంట్‌ రంగినేని అభిలాష్‌, కౌన్సిలర్లు పాకనాటి కృష్ణయ్య, బండారుకృష్ణ, చీర్ల సత్యం, నాగన్నయాదవ్‌, జంపన్నయాదవ్‌, సమద్‌, లక్ష్మినారాయణ, విభూతినారాయణ, భాష్యనాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నందిమల్ల శ్యాంకుమార్‌, ఎల్‌ఐసీ కృష్ణయ్య, గోపాల్‌యాదవ్‌, సూర్యవంశం గిరి, హేమంత్‌ పాల్గొన్నారు.