ఆదివారం 01 నవంబర్ 2020
Wanaparthy - Oct 02, 2020 , 02:57:10

చేపల వలలో మొసలి..!

చేపల వలలో మొసలి..!

  • కల్వరాల నాన్‌ చెరువులో లభ్యం

వీపనగండ్ల: మండలంలోని కల్వరాల గ్రామం సమీపంలోని నాన్‌ చెరువులో మత్స్యకారులు చేపల కోసం వేసిన వలలో మొసలి లభ్యమైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి మత్స్యకారులు నాన్‌ చెరువులో చేపల కోసం వలను వేశారు. గురువారం ఉదయం చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులు వలను లాగగా మొసలి ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు.

వలలో మొసలి పడిన సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక ఎస్సై వహీద్‌అలీబేగ్‌తో పాటు ఫారెస్ట్‌ అధికారుల సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫారెస్ట్‌ అధికారులు మొసలిని బీచుపల్లి సమీపంలోని కృష్ణానదికి తరలిస్తున్నట్లు తెలిపారు. గత కొంత కాలం నుంచి గోపల్‌దిన్నే రిజర్వాయర్‌ సమీపంలోని చెరువులు, కుంటలు, బావుల్లో మొసళ్లు కనిపిస్తున్నట్లు స్థానిక రైతులు తెలియజేస్తున్నారు. వాగులు, చెరువుల దగ్గరకు వెళ్లినప్పడు రైతులు, కాపరులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.