ఆదివారం 01 నవంబర్ 2020
Wanaparthy - Oct 02, 2020 , 02:57:04

నేడు పైలాన్‌ను ప్రారంభించనున్న మంత్రి

నేడు పైలాన్‌ను ప్రారంభించనున్న మంత్రి

వనపర్తి టౌన్‌ : వనపర్తి ప్రజల రెండు తరాలకు దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన మిషన్‌ భగీరథ పథకానికి సంబంధించి పైలాన్‌ను శుక్రవారం మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటీ శ్రీధర్‌ తెలిపారు. గురువారం స్థానిక స్వామి వివేకానంద చౌరస్తాలో చేపట్టిన పైలాన్‌ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.34.78కోట్లతో చేపట్టిన పనులను మంత్రి హాజరై ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.

పెరిగిన పట్టణ జనాభాకు అనుగుణంగా రెండు తరాలకు సరిపడా నీరు అందించడానికి సుమారు 72 కిలోమీటర్లు మిషన్‌ భగీరథ పనులు చేపట్టారన్నారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు స్థానిక వివేకానంద చౌరస్తా వద్ద పనులు ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చేందుకు కృషి చేస్తున్న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డికు  ఆయన ధన్యవాదాలు తెలిపారు.