శుక్రవారం 30 అక్టోబర్ 2020
Wanaparthy - Oct 01, 2020 , 00:31:49

బాధితులకు అండగా సీఎం సహాయనిధి

బాధితులకు అండగా సీఎం సహాయనిధి

  • వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి: అనారోగ్యం బారినపడి మెరుగైన వైద్య సేవలు పొందిన బాధితులకు సీఎం సహాయనిధి అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పరిధిలోని పలు గ్రామాలకు చెందిన బాధితులకు సీఎం సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి అందజేశారు. రూ.6,82,250 విలువగల చెక్కులను 25మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, నాయకుడు తిరుమల్‌నాయుడు ఉన్నారు.