గురువారం 29 అక్టోబర్ 2020
Wanaparthy - Oct 01, 2020 , 00:31:49

రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్ల్లు మృతి

రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్ల్లు మృతి

వెల్దండ: మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. వెల్దండ గ్రామానికి చెందిన  అన్నదానం బాలకిష్టమ్మ, కళావతి ఇద్దరు అక్కా చెల్లెళ్లు. బుధవారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో హైదరాబాద్‌ శ్రీశైలం ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ వైపు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టడంతో బాలకిష్టమ్మ (50), కళావతి (60) అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు   చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్దండ ఎస్సై నర్సిహులు తెలిపారు.