శుక్రవారం 30 అక్టోబర్ 2020
Wanaparthy - Oct 01, 2020 , 00:31:49

అయ్యో బిడ్డా..

అయ్యో బిడ్డా..

  • పాపను సంచిలో కట్టి..పొలం వద్ద వదిలిపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

కల్వకుర్తి రూరల్‌/ వంగూరు: ఆడ బిడ్డ అని భారమైందో..ఆ తల్లికి ఏ ఆపద వచ్చిందో తెలీదు కానీ పుట్టిన గంటలోనే  పసికందును రోడ్డు పక్కన ఓ సంచిలో పడేసిన సంఘటన వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..కొండారెడ్డిపల్లి గ్రామంలో వంకబాయి వద్ద బుధవారం రోడ్డు పక్కన చెట్లపొదల్లో ఓ చిన్నారి ఏడుపు శబ్దాలు వినిపించాయి.

అటు వైపుగా వెళ్తున్న మేకలు కాసే మహిళ శబ్దాలు విని సంచి దగ్గరకు వెళ్లడంతో సంచిలో చిన్న పసికందు కనిపించింది.  వెంటనే  గ్రామ యువకుల సాయంతో వంగూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకొని పసికందును కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించడంతో సూపరింటెండెంట్‌ రమేశ్‌చంద్ర, పిల్లల వైద్యుడు శివరాం చికిత్స అందించారు. కాన్పు అయిన గంట వ్యవధిలోనే పాపకు పేగును కూడా కత్తిరించకుండా అలాగే ఉంచి రోడ్డున వదిలేసి ఉంటారని వైద్యులు,పోలీసులు పేర్కొంటున్నారు. పాపకు చికిత్స నిర్వహించిన అనంతరం ఐపీడీఎస్‌ అప్పగించగా వారు పాలమూరులోని శిశువిహార్‌కు తరలించారు.