బుధవారం 21 అక్టోబర్ 2020
Wanaparthy - Oct 01, 2020 , 00:31:46

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

రేవల్లి : ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు మండలంలోని చీర్కపల్లి గ్రామంలోని గాంధీనగర్‌కు చెందిన అనిత, నాగరాజు కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెండ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెంది వారివారి ఇంట్లో అనిత, నాగరాజు ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు వారిని వెంటనే వనపర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై పోలీసు స్టేషన్‌లో వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై అరుణ్‌కుమార్‌ తెలిపారు.


logo