మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Sep 28, 2020 , 06:15:06

వ్యవసాయరంగానికి నష్టం చేసే బిల్లు వద్దు

వ్యవసాయరంగానికి నష్టం చేసే బిల్లు వద్దు

వనపర్తి టౌన్‌ : వ్యవసాయ రంగానికి నష్టం చేసే వ్యవసాయ రంగ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టం చేసి అంబానీ, ఆదానీ కోసమే కేంద్రం వ్యవసాయ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందని, వ్యవసాయ మార్కెట్‌లు ప్రైవేట్‌ పరం చేసేందుకు ఒప్పంద సాగు చట్టం, విద్యుత్‌ సవరణ చట్టం తీసుకువచ్చి రైతులను సాగుకు దూరం చేసే విధంగా ఈ బిల్లు ఉందన్నారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు జబ్బార్‌, జాన్‌వెస్లీ ఉన్నారు.