బుధవారం 28 అక్టోబర్ 2020
Wanaparthy - Sep 28, 2020 , 06:15:03

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వం  చర్యలు తీసుకోవాలి

వనపర్తి టౌన్‌ : పరువు హత్యలు పునరావృతం కాకుండా చట్టాలు రూపొందించి అమలు చేయాలని కేవీపీఎస్‌, దళిత సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ మొన్న ప్రణయ్‌ నిన్న హే మంత్‌ పరువు హత్యలకు గురయ్యారని, ఇలాంటి దారుణాలు పు నరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటిదాకా 46 హత్యలు జరిగాయని హేమంత్‌ వైశ్యుడు, అవంతిరెడ్డి ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని పోలీస్‌ అధికారులను ఆ శ్రయించినా అవంతిరెడ్డి తల్లిదండ్రులు కిరాయి హంతకులతో కిడ్నాప్‌ చేయించి పాశవికంగా హత్య చేయడం దుర్మార్గమన్నారు. వీరిని కఠినంగా శిక్షించాలని, కులాంతర వివాహం చేసుకున్నవారికి భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంఈఎఫ్‌, కేవీపీఎస్‌, బీఎస్పీ, మాల మహానాడు నాయకులు కృష్ణ, రాజరాంప్రకాశ్‌, భగత్‌, సాయిలీల, శేఖర్‌, నరసింహ, రవి, చిరంజీవి, త్యాగయ్య, నాగరాజు, గంగన్న, మధు, శాంతయ్య, మన్నెం, రాముడు ఉన్నారు.


logo