బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Sep 28, 2020 , 06:10:44

ప్రైవేట్‌ దవాఖానలో బాలింత మృతి

 ప్రైవేట్‌ దవాఖానలో బాలింత మృతి

వనపర్తి: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో బాలింత మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యులు కథనం మేరకు శ్రీరంగాపురం మండలం పామాపురం గ్రామానికి చెందిన సంధ్యారాణి రెండవ కాన్పు నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు ఉదయం రాగా సిజేరియన్‌ చేయగా, సంధ్యరాణికి చాలా సీరియస్‌గా ఉందని, వెంటనే కర్నూల్‌ పెద్ద దవాఖానకు తీసుకెళ్లాలని దవాఖాన యాజమాన్యం సూచించడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆమెను కర్నూల్‌కు తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో చనిపోయిందన్నారు. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ దవాఖానకు తీసుకువచ్చి యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు మృతురాలిని దవాఖానలో దాచి ఉంచి బాధితులతో బేరసారాలను ఆడుతున్నారు.