ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Sep 27, 2020 , 06:44:26

తాళ్ల చెరువు ఉధృతిపై అప్రమత్తంగా ఉన్నాం

తాళ్ల చెరువు ఉధృతిపై అప్రమత్తంగా ఉన్నాం

  • మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ 

వనపర్తి : జిల్లా కేంద్రంలో తాళ్ల చెరువు వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉన్నామని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా ముసురు వాన కురుస్తుండటంతో మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, వార్డు కౌన్సిలర్‌ చీర్ల సత్యంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కురిసిన వర్షాలకు పట్టణంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయని, ఇకపై అలా జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అందులో భాగంగా శనివారం పరిశీలించినట్లు ఆయన వివరించారు. చెరువులో నీటిని, అలుగు ద్వారా వచ్చే వరద నీటిని అంచనా వేసినట్లు తెలిపారు.