ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Sep 25, 2020 , 06:11:14

సమస్యలు పరిష్కరించాలి

 సమస్యలు పరిష్కరించాలి

వనపర్తి టౌన్‌ : నాయీబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని గురువారం ఆ సంఘం నేతలు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశా . ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ కరోనా కారణంతో క్షౌరాలకు కస్టమర్లు రాక షాపు యజమానులకు అద్దెలు, కరెంట్‌ బిల్లులు కట్టలేక దుకాణాలు మూతపడుతున్నాయని ప్రభుత్వం తక్షణమే ప్రతి కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో నాయీబ్రాహ్మణులకు ప్రభుత్వం 2015, 16, 18 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం రూ.250కోట్ల నిధులు కేటాయించారని, ఈ నిధులు సక్రమంగా పంపిణీ జరుగలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దేవాలయాల్లో వాయిద్య పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఐదు నెలల పెండింగ్‌ వేతనాలు తక్షణమే చెల్లించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కేంద్రంలోని నాయీబ్రాహ్మణ కాలనీలు నాగవరంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందని చెప్పారు. 

నూతన కార్యవర్గాన్ని సన్మానించిన మంత్రి

ఇటీవల నాయీబ్రాహ్మణుల పట్టణ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా మంత్రి నిరంజన్‌రెడ్డి కమిటీ సభ్యులను శాలువా, పూలమాలతో సన్మానించారు. పట్టణాధ్యక్షుడు వెంకట్రాములు, గౌరవ అధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా నారాయణదాస్‌, జిల్లా అధ్యక్షుడు సత్యం, సభ్యులు రమేశ్‌బాబు, పాండు, ఆశ్విన్‌కుమార్‌, మహేందర్‌, కేశవులు, మంజునాథ్‌, రాజు, లోకేశ్‌, విజయ్‌కుమార్‌, శ్రీనివాసులు, బాలస్వామి, శేఖర్‌, గోవింద్‌ మహేశ్‌లను మంత్రి సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.


తాజావార్తలు