శుక్రవారం 23 అక్టోబర్ 2020
Wanaparthy - Sep 25, 2020 , 06:03:15

రెవెన్యూ చట్టం చరిత్రాత్మకం

 రెవెన్యూ చట్టం చరిత్రాత్మకం

  • ఇది రైతు రాజ్యం..రైతు ప్రభుత్వం 
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి: రైతును రాజును చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఇది రైతు ప్రభుత్వం రైతు రాజ్యం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో రైతుబంధు సమితి సభ్యులతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో అశాంతికి  కారణం భూ సమస్యలే అని, చిలికి చిలికి హత్యల వరకు దారి తీసిన గొడవలను చాలానే చూడడం జరిగిందన్నారు. అలాంటి వ్యవస్థకు స్వస్తి పలుకుతూ గ్రామాలు ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందన్న భావనతోనే రెవెన్యూచట్టం తీసుకొచ్చామని, ఇది చరిత్రాత్మకమని మంత్రి వివరించారు.

నూతన చట్టంతో రైతులు గుండె మీద చేయి వేసుకుని ప్రశాంతంగా ఉండవచ్చన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రాష్ట్రంలో ఉచిత కరెంటు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, 2018 జనవరి 1నుంచి విజయవంతంగా అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. కరోనా ఇబ్బందులలో కూడా అన్ని రంగాలు అతలాకుతలం అయినా కేసీఆర్‌ వంద శాతం పంటలు తెలంగాణలో మద్దతు ధరకు కొనుగోలు చేసి వ్యవసాయ రంగానికి చేయూతను ఇవ్వడం జరిగిందన్నారు. యాసంగిలో ఎఫ్‌సీఐ దేశ వ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో ఒక్క తెలంగాణ నుంచే 55శాతం ఉందన్నారు. ఆకలిదప్పుల తెలంగాణ..కేసీఆర్‌ నాయకత్వంలో అన్నపూర్ణగా నిలిచిందన్నారు. నియంత్రిత సాగుతో లాభదాయక పంటలు పండించి రైతులు మరిన్ని లాభాలు గడించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి సభ్యులు తదితరులు ఉన్నారు. 

బాధితులకు చెక్కులు పంపిణీ 

వనపర్తి: బాధితులకు సీఎం సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అందజేశారు. వనపర్తి ఆరో వార్డుకు చెందిన పార్టీ కార్యకర్త బాలముని బాలయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోవడంతో పార్టీ నుంచి విడుదలైన బీమా రూ.2లక్షల విలువ గల చెక్కును మృతుని భార్య వరలక్ష్మికి మంత్రి నిరంజన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. logo