మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Sep 24, 2020 , 05:41:40

రైతువేదిక నిర్మాణ పనులు పూర్తి చేయాలి

రైతువేదిక నిర్మాణ పనులు పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

గోపాల్‌పేట : రైతువేదిక నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నారు. బుధవారం ఆమె మండలంలోని బుద్దారం గ్రామంలో రైతు వేదిక, ప్రకృతి వనం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

అనుకున్న గడువులోగా అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ హర్యానాయక్‌, తాసిల్దార్‌ నరేందర్‌, ఎంపీడీవో కరుణశ్రీ, సర్పంచ్‌ పద్మ మ్మ, ఉప సర్పంచ్‌ నాగరాజు, ఎంపీటీసీ శ్రీదేవి, ఏపీ వో నరేందర్‌, పంచాయతీ కార్యదర్శి రమేశ్‌నాయు డు, వార్డు సభ్యులు శ్రావణ్‌కుమార్‌, లచ్చగౌడ్‌, తోళ్లరవి ఉన్నారు.

రైతువేదిక నిర్మాణాలను  ప్రతిష్టాత్మాకంగా తీసుకోవాలి

వనపర్తి రూరల్‌ : జిల్లాలో చేపట్టిన రైతువేదిక నిర్మాణాలను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మాకంగా తీసుకొని పనులను చేపట్టాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. బుధవారం మండలంలోని అంకూర్‌ గ్రామంలో నిర్మాణమవుతున్న రైతువేదిక పనులను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన సమయంలోపు పనులను పూర్తి చేయాలని సూచించారు.

అక్టోబర్‌ 10వ తేదీలోగా పూర్తి చేసి అందించాలన్నారు. అంతకుముందు జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి రైతు వేదిక నిర్మాణ పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ డీఈ శివకుమార్‌, తసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో రవీంద్రబాబు, సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.