సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Sep 24, 2020 , 05:41:43

దేవస్థాన భూమిపై అపోహలు వద్దు

దేవస్థాన భూమిపై అపోహలు వద్దు

వనపర్తి : పట్టణంలో అన్యాక్రాంతం అవుతున్న 3.20 ఎకరాల భూమి విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని ఉద్యమం యథావిధిగా కొనసాగుతుందని టీడీపీ మాజీ పట్టణాధ్యక్షుడు అశోక్‌ బుధవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఆక్రమించిన స్థలంలోనే ప్రజ ల భాగస్వామ్యంతో అఖిల పక్షం నాయకులతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. వాస్తవాలు ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కబ్జాదారులకు  సవాలు విసరడం జరిగిందని, ఇది ప్రజల ఆస్తి అని, వందశాతం ఆలయ భూములు ప్రజలకు చెందాలని పేర్కొన్నారు.