ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Sep 24, 2020 , 03:23:08

రైతులకు నష్టం చేసే బిల్లును రద్దు చేయాలి

రైతులకు నష్టం చేసే బిల్లును రద్దు చేయాలి

వనపర్తి టౌన్‌ : రైతులకు నష్టం చేసే వ్యవసాయ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని రైతు సంఘాల నేతలు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో అన్ని రైతు సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి వ్యవసాయ బిల్లు జీవో పత్రలను దహనం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు రెట్టింపు ఆదాయం తెస్తామని మాటలు చెప్పి నేడు కంపెనీలతో ఒప్పంద వ్యవసాయం చేయడానికి సన్నహాలు చేస్తుందని విమర్శించారు. ఈనెల 25న మండల, జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గోపి, బాల్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, పరమేశ్వరాచారి, భాస్కర్‌, వెంకటేశ్‌, మహేశ్‌, కళ్యాణ్‌, రమేశ్‌ ఉన్నారు.