మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Sep 24, 2020 , 02:19:34

జోరుగా ఐపీఎల్‌ బెట్టింగ్‌లు

జోరుగా ఐపీఎల్‌ బెట్టింగ్‌లు

  • యువత మోజు.. పందెంరాయుళ్ల జోరు
  • ఆన్‌లైన్‌లో చెల్లింపులు
  • జేబులు గుల్ల చేసుకుంటున్న వైనం

కాయ్‌ రాజా కాయ్‌.. అంటూ బెట్టింగ్‌ దందా జోరుగా సాగుతున్నది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం కావడంతో ‘వస్తే వెయ్యి..పోతే వంద’ అన్న చందంగా పందెం కాస్తున్నారు. ఆ జట్టు గెలిస్తే వెయ్యి..ఓడితే రెండింతలు.. ఈ బంతి సిక్స్‌ పోతే ఇంత..ఫోర్‌ పోతే అంత..వికెట్‌ పడితే ఇంతా అంటూ బెట్టింగులు కాస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్‌ బంగార్రాజులపై నిఘా పెంచి వారిని నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ పలువురు కోరుతున్నారు.

- నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ/వనపర్తి 

జూదం.. ఒకప్పుడు ఈ పేరు వింటేనే హడల్‌.. ఇంట్లో తగాదాలతో పాటు ఉన్న ఆస్తినంతా అమ్ముకుని రోడ్డున పడేవారు.. ఇప్పుడు అలాంటిదే ఇంకో రకమైన మహమ్మారి వచ్చేసింది.. ఐపీఎల్‌ బెట్టింగ్‌.. 

క్రికెట్‌ ప్రియులకు ఐపీఎల్‌ చాలా మజాను పంచుతుంది.. దీనిని ఆసరాగా చేసుకున్న బెట్టింగ్‌ బంగార్రాజులు సాంకేతికతను అందిపుచ్చుకుని పందేలు కాస్తున్నారు.. ఫలానా జట్టు ఇంత స్కోర్‌ చేస్తుంది.. ఫలానా క్రికెటర్‌ ఎన్ని రన్స్‌ కొడతాడు.. ఫలానా బోలర్‌ ఎన్ని వికెట్లు తీస్తాడు.. వంటి వాటిపై పందేలజోరు కొనసాగుతున్నది.. ఇలా బంతి బంతికి పందేలు వేస్తున్నారు.. పదికి వంద, వందకు వెయ్యి, వెయ్యికి పదివేలు, పదివేలకు లక్ష రూపాయల చొప్పున బెట్టింగ్‌ వేస్తున్నారు.. ఇలా బెట్టింగ్‌లు కాస్తూ క్రికెట్‌ ప్రియులు ఇండ్లల్లోని విలువైన వస్తువులను అమ్ముకుంటున్నారు.. బెట్టింగ్‌ రాయుళ్లు చూపిస్తున్న ఆఫర్లకు బలవుతున్నారు.. దీనిని పోలీసులు నిలువరించాలని  పలువురు కోరుతున్నారు..

- నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ/వనపర్తి 

ముంబై ఇండియన్స్‌ గెలుస్తుంది..! కాదు చెన్నైదే గెలుపు..! ఈ రోజు పంజాబ్‌ ఓపెనర్‌ స్కోర్‌ ఎం త..?, బెంగళూరు జట్టు ఎన్ని పరుగులు చేస్తుం ది..? హైదరాబాద్‌ గెలుస్తుందా..? కోల్‌కత్తాను వి జయం వరిస్తుందా..? ఇలా సాధారణ క్రికెట్‌ అభిమానులు లెక్కలు వేసుకొంటూ ఐపీఎల్‌ను ఎంజా య్‌ చేస్తున్నారు. అయితే బెట్టింగ్‌ రాయుళ్లు మా త్రం ఈ లెక్కలపై పందేలు కాస్తున్నారు. ఫలితంగా వేలాది మంది జేబులకు చిల్లులు పడుతున్నాయి. మారిన కాలంతో ప్రపంచ క్రీడగా మారిన క్రికెట్‌ బె ట్టింగ్‌ ఇప్పుడు గ్రామాలకు సైతం పాకింది. 

క్రికెట్‌ ప్రేమికులకు మజాను పంచే ఐపీఎల్‌ ప్రారంభమైంది. దేశంలో కోట్లాది మంది ప్రజలను అలరించే ఈ క్రికెట్‌.. లక్షలాది మందికి జూదంగా మారింది. ఇండియా ఎక్కడ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడినా గెలుపోటములపై బెట్టింగ్‌ కట్టడం పరిపాటి. ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌లైతే బెట్టింగ్‌ రాయుళ్లలో మరింత జోష్‌ తీసుకొస్తుంది. హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లకు పెద్ద మొత్తంలో పందేలు కాస్తున్నారు.

సామాజిక మాధ్యమాలే ప్రచార అస్ర్తాలు..

ఇంతకుముందు సెల్‌ఫోన్లలో మాట్లాడుకుంటూ పందేలు కాసేవారు. చాలా మంది టీవీల్లో మ్యాచ్‌ లు చూస్తూ, లాడ్జింగ్‌లు, హోటళ్లలో కూర్చొని బె ట్టింగ్‌లు వేసేవారు. దీనికి పట్టణ కేంద్రాల్లోని క్రీడా మైదానాలను వేదికలుగా మార్చుకునేవారు. ఇప్పు డు సోషల్‌ మీడియా విస్తృతితో బెట్టింగ్‌ రాయుళ్లు ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే గ్రూపులుగా ఏర్పడ్డారు. వాట్సాప్‌ గ్రూపులను సైతం ఏర్పాటు చేశారు. పది మందికి ఒక వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని ఎవరికీ అనుమానాలు రాకుండా యథేచ్ఛగా బెట్టింగ్‌ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మ్యాచ్‌ ప్రారంభం నుంచే పలు అంశాలపై బెట్టింగ్‌లను ఆ హ్వానిస్తున్నారు. స్థానిక బెట్టింగ్‌ రాయుళ్లతోపాటు హైదరాబాద్‌తోనూ ఈ జూదరులు లింక్‌ ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల హైదరాబాద్‌, ముంబైలాంటి మెట్రోపాలిటన్‌ సిటీల నుంచి పాలమూరులోని కుగ్రామాలకు సైతం ఈ బెట్టింగ్‌ రాయుళ్లు త మ నెట్‌వర్క్‌ను అనుసంధానించుకున్నారు. మ్యాచ్‌ సాగే అప్పటి పరిస్థితులను బట్టి ఈ బెట్టింగ్‌లో పెట్టే డబ్బుల్లో మార్పులు ఉంటాయి. యువత తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న ఆలోచన తో అప్పులు చేసి మరీ పందేలు కాస్తున్నారు. 

కుగ్రామాల్లోనూ జూదం..

జిల్లా, పట్టణ కేంద్రాలతో పాటు కుగ్రామాలలో సైతం పలువురు యువకులు బెట్టింగ్‌ రాయుళ్ల అవతారమెత్తారు. రూ.100మొదలుకొని రూ.10వేల వరకూ సాధారణంగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. మ్యాచ్‌ల పరిస్థితులను బట్టి రూ.20వేల నుంచి రూ.50వేల వరకూ కొందరు హైదరాబాద్‌ బెట్టింగ్‌ బృందాలతో పందేలు కాస్తున్నారు. గతంలో లా డ్జీల్లో ఉంటూ ఈ బెట్టింగ్‌కు పాల్పడే బృందాలు కరోనా కారణంగా అవి మూసి ఉండటంతో హోం టు వర్క్‌ మాదిరిగా సెల్‌ఫోన్లలోనే బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. దీంతో గతంకంటే ఎక్కువ మంది ఈ బెట్టింగ్‌కు ఆకర్షితులవుతున్నారు. ఇంతకు ముందు నాగర్‌కర్నూల్‌తోపాటు పలు పట్టణాల్లో బెట్టింగ్‌ రా యుళ్లు పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. అయితే సరైన ఆధారాలు లేని కారణంతో పాటుగా రాజకీయ ప్రభావంతో చిన్నచిన్న కేసులతో తప్పించుకున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌ బెట్టింగ్‌ రాయుళ్లపై కఠినంగా వ్యవహరిస్తే చాలా మంది యువతతోపాటు కుటుంబాల్లోనూ గొడవలు, కష్టాలు తీరుతాయి.

గూగుల్‌లో సెర్చ్‌ చేస్తూ..

నూతన అంశాలను తెలుసుకోవడానికి ప్రతి ఒ క్కరూ గూగుల్‌ను వినియోగిస్తారు. దీనిని యువత మరో రకంగా ఉపయోగించుకుంటున్నది. ఐపీఎల్‌ బెట్టింగ్‌ను ఎలా వేయాలి..?, బెట్టింగ్‌ యాప్‌లు..? వంటి వాటిని తెలుసుకుంటున్నారు. గతంలో ఆట పూర్తి కాగానే అందరూ ఒక దగ్గరకు చేరి గెలిచిన వాడు ఓడిన వాళ్ల దగ్గర డబ్బులను వ సూళ్లు చేసుకునేవారు. ప్రస్తుతం ప్రతి ఒక్కటీ ఆన్‌లైన్‌ కావడంతో డబ్బులను పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, మనీ ట్రా న్స్‌ఫర్‌ వంటి యాప్‌ల ద్వారా డబ్బులు అకౌంట్లకు మారుతున్నాయి.

యువత మోజు.. బెట్టింగ్‌ రాయుళ్ల జోరు..

బెట్టింగ్‌ రాయుళ్లు ప్రధానంగా యువతను టా ర్గెట్‌ చేస్తున్నారు. పది మందికి ఒకరు చొప్పున బె ట్టింగ్‌ రాయుళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తారు. వీరికి బెట్టింగ్‌ రాయుళ్లు మ్యాచ్‌ ఓడినా.., గెలిచినా 5 శాతం చొప్పున చెల్లిస్తుండడంతో అనుకూలంగా వ్యవవహరించే వ్యక్తి యువతను బెట్టింగ్‌ల వైపు ప్రోత్సహిస్తున్నారు. ప్రధాన చౌరస్తాలు, ఎటువంటి సంచారం లేని వీధులను ఎంపిక చేసుకుని ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. బెట్టింగ్‌ రాయుళ్లకు అ నుకూలంగా ఉన్న వ్యక్తి యువతతో మాట్లాడి ఈ సీ జన్‌లో బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఏడాది కష్టపడినా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రాదంటూ యువతను రెచ్చగొట్టి మరీ ఈ కూపంలోకి దింపుతున్నారు. 

బెట్టింగ్‌ తీరిది..!

బెట్టింగ్‌ రాయుళ్లు ప్రధాన టీంలకు ఒక రేటు, మామూ లు జట్లకు ఒక రేటును ఫిక్స్‌డ్‌ చేస్తారు. ప్ర ధాన టీంలో ప్రతి ఓవరుకు లేదా ప్రతి బ్యాట్‌మెన్స్‌ సాధించే పరుగుల మీద, ప్రతి బౌలర్‌ తీసే వికెట్లపై ఒక్కో రేటును నిర్ణయిస్తున్నారు. మొదటి రెండు రోజులు సరాదాగా అలవాటైన బె ట్టింగ్‌లు క్రమేణా జూదంలా మారి ప్రతి ఏడాది ఎక్కడ ఉన్నా కూడా బె ట్టింగ్‌ వేస్తున్నారు. బెట్టింగ్‌ కాసే సమయంలో డబ్బులు లేకుంటే ఖాళీ ప్రామిసరీ నోట్‌ సంత కం లేదా బైకులు, మొబైల్స్‌ను పెట్టుకు ని రూ.పది మిత్తితో బెట్టింగ్‌ రాయుళ్లే డబ్బులను ఇవ్వడం విశేషం. త క్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించానే దురాలోచనతో.., బెట్టింగ్‌ రాయుళ్లు చూ యించే ఆఫర్లకు లొంగుతున్నా రు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఏ వీధిలో చూసినా బెట్టింగ్‌ల జోరు ప్రారంభమైంది. దీంతోపాటు మ్యాచ్‌ను తిలకిస్తూ మద్యం సేవించడం వ్యసనంలా మారుతున్నది. గెలిచిన వాడికి ఓడిన వాడు అ ప్పుడే డబ్బులు కట్టాలి.. ఆ సమయంలో డబ్బులు లేకపోవడం లేదా వేసిన టీం వరుసగా ఓడిపోవడంతో చాలా మంది అప్పులు పాలైన సందర్భాలు ఉన్నాయి. ఇలా చిన్నగా ప్రారంభమైన గొడవలు చిలికి చిలికి గాలి వానలా మారి పెద్ద పెద్ద సంఘటనలకు దారి తీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

బెట్టింగ్‌ను అరికట్టాలంటే.. 

బెట్టింగ్‌లను పూర్తిగా అరికట్టాలంటే విద్యార్థులు, యువకులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిని సారించాలని పోలీసులు సూచిస్తున్నారు. క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడే వారే దానిపై ఉన్న మోజుతో ఊబిలోకి కూరుకుపోతున్నారని హెచ్చరిస్తున్నారు. మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో పిల్లలు టెన్షన్‌గా ఉండటం, సెల్‌, ల్యాప్‌ట్యాప్‌, కంప్యూటర్ల వినియోగం అధికంగా ఉంటే వారిని ఆరా తీయాలి. మనీ ట్రాన్స్‌ఫర్లపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. 

బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు..


ఎవరూ ఐపీఎల్‌ బెట్టింగ్‌కు పాల్పడకూడదు. దీనికోసం పట్టణంలో ప్రత్యేక పోలీసు గస్తీ బృందాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఎవరైనా, ఎక్కడైనా క్రికెట్‌ పేరిట బెట్టింగ్‌లు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 

- మాధవరెడ్డి, ఎస్సై, నాగర్‌కర్నూల్‌

దొరికితే కేసులు నమోదు..


ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌లపై మఫ్టీ, ఆన్‌లైన్‌లో ఉన్న పోలీసుల ద్వారా నిఘా అప్రమత్తం చేస్తాం. పట్టుబడితే కేసులు నమోదు చేస్తాం. బెట్టింగ్‌ విషయంలో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

- సూర్యానాయక్‌ , పట్టణ సీఐ వనపర్తి