మంగళవారం 20 అక్టోబర్ 2020
Wanaparthy - Sep 23, 2020 , 04:15:03

అక్టోబర్‌ 10లోగా రైతు వేదికలు పూర్తి చేయాలి

అక్టోబర్‌ 10లోగా రైతు వేదికలు పూర్తి చేయాలి

  •  కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌ బాషా

చిన్నంబావి : ప్రభుత్వం రైతుల కోసం ప్రతి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలను అక్టోబర్‌ 10వ తేదీలోగా నిర్మాణాలను పూర్తి చేసి ఇవ్వాలని గుతేదారులను, అధికారులను కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా ఆదేశించారు. మంగళవారం మండలంలోని కొప్పునూర్‌, దగడపల్లి, వెలగొండ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదిక భవనాల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అక్టోబర్‌ 10వ తేదీ వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలని, నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు ప్రతి రోజు రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసేవిధంగా చూడాలని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలకు ఇప్పటికే స్థలాలు కేటాయించడం జరిగిందని, ఈనెల 30వ తేదీలోగా అన్ని గ్రామాల్లో ప్రకృతి వనాల పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఇటీవల ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంను తీసుకురావడం జరిగిందన్నారు. ఎవరైనా అనాధికారికంగా ప్లాట్లు కొన్నవారు ఉంటే అలాంటి వారు తమ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ శాంతిలాల్‌, ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్‌, ఎంపీపీ సోమేశ్వరమ్మ, పంచాయతీరాజ్‌ ఈఈ శివకుమార్‌, డిప్యూటీ ఈఈ చెన్నయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి దేవప్రసాద్‌, ఏఈవో యుగేందర్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ప్రభుత్వ భవన

 నిర్మాణాలకు అడ్డుపడితే చర్యలు 

వీపనగండ్ల : అక్టోబర్‌ 10వ తేదీలోగా వచ్చేసరికి రైతు భవనాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిరంతరం కృషి చేయాలని గుత్తేదారులను, అధికారులను కలెక్టర్‌ షేక్‌ యా స్మిన్‌ బాషా ఆదేశించారు. మంగళవారం  మండలంలోని బొల్లారం, తూంకుంట గ్రామాల్లో కలెక్టర్‌ రైతు భవనాల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బొల్లారం గ్రామంలో ప్రకృతి వనం నిర్మాణం చేపట్టుటకు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడంతోపాటు ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు అడ్డుపడుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. అందులో భాగంగా డీఎస్పీ కిరణ్‌కుమార్‌ మండలంలోని బొల్లారం, నాగర్లబండ తండా గ్రామ పంచాయతీలను సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వ్యక్తులు స్వచ్ఛందంగా తప్పుకొని ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సహకరించాలని సూచించారు. లేని యెడల చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శివకుమార్‌, డీఈ చెన్నయ్య, తాసిల్దార్‌ యేసయ్య, ఎంపీడీవో కతలప్ప, వ్యవసాయాధికారి ఢాకేశ్వర్‌ గౌడ్‌, ఏఈ షబ్బీర్‌ ఉష్సేన్‌ సర్పంచ్‌ పద్మమ్మ, ఎంపీటీసీ కవిత పాల్గొన్నారు. logo