ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Sep 21, 2020 , 06:30:10

వచ్చే నెలలో రెండో విడుత గొర్రెల పంపిణీ చేస్తాం..

వచ్చే నెలలో  రెండో విడుత గొర్రెల పంపిణీ  చేస్తాం..

వనపర్తి రూరల్‌ : రాష్ట్రంలో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చేసేందుకు సీఎం ఆదేశాలు జారీ చేశారని గొర్రెల పెంపకదారుల సంఘం జిల్లా చైర్మన్‌ కురుమూర్తి యాదవ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గొర్రెల పెంపకదారుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జిల్లా పర్యటనలో సందర్భంగా ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు.

రెండో  విడుతలో పంపిణీ చేసిన వాటిలో మిగిలిన డీడీలకు వచ్చే నెల అక్టోబర్‌లో గ్రౌండింగ్‌ చేయాలని జేడీని మంత్రి తలసాని ఆదేశించారని అన్నారు. అలాగే గొర్రెల షేడ్లు కట్టుకునే వారికీ రూ.2లక్షలు, ఎన్‌ఆర్‌జీఎస్‌ కింద రూ.90 వేలు, సీఎస్‌ఆర్‌ కింద రూ.1.10లక్ష అందజేస్తుందని తెలిపారు. సోమవారం చేపట్టిన ప్రగతి భవన్‌, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి కురుమ, యాదవులు పాల్గొనొద్దని కోరారు.