శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Sep 21, 2020 , 06:30:10

నిషేధిత గుట్కా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం

నిషేధిత గుట్కా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం

  • రూ.17,165 విలువ గల గుట్కా పట్టివేత
  • ఎస్సై వెంకటేశ్‌గౌడ్‌ 

వనపర్తి : నిషేధిత గుట్కాను వనపర్తి పట్టణంలో ఎవరైనా క్రయవిక్రయాలు చేసినట్లయితే వారిపై కేసులను నమోదు చేస్తామని పట్టణ ఎస్సై వెంకటేశ్‌గౌడ్‌ అన్నారు. శనివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పట్టణంలోని అయ్యప్ప కిరాణం, అంబికా కిరాణం, శివసాయి కిరాణ షాపులో కచ్చితమైన సమాచారం మేరకు దాడులను నిర్వహించి రూ.17,165లు విలువ గల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకుని యజమానులు బాలరాజు, మధుసూదన్‌, సాయిరాంలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పట్టణంలో ఎక్కడైనా, అక్రమాలకు పాల్పడే వారిపై 9440795722 నెంబర్‌కు ఫోన్‌లో సమాచారం అందజేయాలన్నారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్‌ నవీన్‌కుమార్‌ గౌడ్‌, శ్రీశైలం తదితరులు  పాల్గొన్నారు.