గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Sep 20, 2020 , 04:40:47

సర్వే బృందాన్ని ఏర్పాటు చేయాలి

సర్వే బృందాన్ని ఏర్పాటు చేయాలి

  • కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా

వనపర్తి : జిల్లాలో చెరువులు, కుంటల నాలాలు, ఎఫ్‌టీఎల్‌ ఎక్కడైనా ఆక్రమణకు గురైతే ఆక్రమణలను తొలగించేందుకు ఇరిగేషన్‌, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులతో సర్వే కోసం బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా తెలిపారు.

శనివారం ఆమె తన చాంబర్లో వర్షాల కారణంగా నిండిన చెరువులు, కుంటలు, వాటి నీటి సామర్థ్యం తదితర విషయాలపై సమీక్షించారు. చెరువులు, కుంటల ఆక్రమణలపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21 నుంచి మున్సిపల్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ సంయుక్త బృందాలు జిల్లా మున్సిపల్‌, పట్టణ ప్రాంతాలతోపాటు మండలాల్లో చెరువులు, కుంటల నాలాలు, ఎఫ్‌టీఎల్‌లు ఎక్కడైనా ఆక్రమణకు గురైనట్లయితే సర్వే చేసి తొలగించాలని ఆదేశించారు.

సోమవారం నుంచి వనపర్తి పట్టణంలో తాళ్ల చెరువు నాలా ఆక్రమణలను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఇరిగేషన్‌ ఈఈ ఆంజనేయులు, వనపర్తి తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.