బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Sep 20, 2020 , 02:56:28

పనులు పూర్తి చేయాలి

పనులు పూర్తి చేయాలి

  • సీఎం ఓఎస్డీ స్మితాసబర్వాల్‌కు ఎమ్మెల్యే ఆల వినతి

కొత్తకోట/మూసాపేట : కొత్తకోట మండలంలోని కానాయపల్లి భీమా ఫేస్‌-2 ప్యాకేజీ-19లో భాగంగా శంకరసముద్రం రిజర్వాయర్‌ కింద 8వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ఆర్‌ఆండ్‌ఆర్‌ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సీఎం ఓఎస్డీ స్మితాసబర్వాల్‌కు విన్నవించారు. ప్రధానంగా కానాయపల్లి నిర్వాసితులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు, నిర్వాసిత ప్రయోజనాలు కల్పించాలని కోరారు.

అదేవిధంగా సోషియో ఎకానమిక్‌ సర్వేలో తప్పిపోయిన నిర్వాసితుల పేర్లను తిరిగి సర్వే చేయించి నమోదు చేయాలన్నారు. గ్రామంలో నిర్వాసితులందరినీ సీఫాం కింద రూ. 5లక్షలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరా రు. అలాగే, దేవరకద్ర మండలంలోని కౌకుంట్లను మండలంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం సీఎం ఓఎస్డీ స్మితాసబర్వాల్‌కు వినతిపత్రం అందజేశారు. కౌకుంట్లను మండలంగా చేయడంవల్ల ప్రజలకు పరిపాలనా సౌలభ్యం లభిస్తుందని వివరించారు.