శుక్రవారం 30 అక్టోబర్ 2020
Wanaparthy - Sep 20, 2020 , 02:52:24

సాగుకు సర్కారు అండ

సాగుకు సర్కారు అండ

  • దేశానికి దిక్సూచిలా  సీఎం కేసీఆర్‌ పాలన 
  • వనపర్తి జిల్లాలో 71  రైతు వేదికలు
  • అక్టోబర్‌ 5లోగా రైతువేదికలు అప్పగించాలి
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి/పెద్దమందడి : ఉమ్మడి రాష్ట్రంలో బీడు భూ ములుగా దర్శనమిచ్చిన పొలాలు తెలంగాణ రాష్ట్రంలో కోనసీమను తలపిస్తున్నాయని, సాగుకు సర్కారు అం డగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం పెబ్బేర్‌, ఆత్మకూర్‌ మండలాల్లోని మునగమాన్‌దిన్నె, రామమ్మపేట, జూ రాల గ్రామాలకు చెందిన దళిత రైతులకు వందశాతం సబ్సిడీ కింద మంజూరైన రూ. 6లక్షల విలువైన చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో సాగు పెరిగిందని, ఈ వానకాలంలో కోటి 42లక్షల ఎకరాల్లో సాగవుతుందని, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ పథకాలను ప్రభు త్వం అందిస్తున్నదన్నారు.


దేశానికి దిక్సూచిలా సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారని మంత్రి వివరించారు. కేంద్ర వ్యవసాయ బిల్లు రైతాంగం నడ్డి విరిచేలా ఉందని, తెలంగాణ ప్రభుత్వ రైతు అనుకూల వి ధానాలకు విరుద్ధంగా ఉందని అన్నారు. అదేవిధంగా వనపర్తి నియోజకవర్గంలోని బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను, రేవల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు క ల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి అందజేశారు. పెద్దమందడి మండలంలోని లబ్ధిదారులకు మం జూరైన కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి నిరంజన్‌రెడ్డి తాసిల్దార్‌ కార్యాలయంలో పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, ఎంపీపీ మెగారెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, వనపర్తి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, కౌన్సిలర్‌ మహేశ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, మాజీ కౌన్సిలర్‌ తిరుమల్‌నాయుడు, తాసిల్దార్‌ సునీత, ఎంపీడీవో రఘురాం, సూ పరింటెండెంట్‌ భానుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.