మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Sep 19, 2020 , 06:22:17

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఇనిస్టిట్యూషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో డిగ్రీ కోర్సుతోపాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఆఫీసర్‌  ఎంపిక కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారిణి వనజ తెలిపారు. మాజీ సైనికులు, వితంతువుల ఆడపిల్లలకు టీఎస్‌డబ్ల్యూఆర్‌ ఆర్మీ ఫోర్సెస్‌లో డిగ్రీ కళాశాలలో మహిళలకు బీబీనగర్‌, భువనగిరి జిల్లాలో మూడు సంవత్సరాలు ఉచిత డిగ్రీ కోర్సు బీఎస్సీ, బీఏ, బీకాం కోర్సులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 60శాతం కన్న ఎక్కువ మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలని, విద్యార్థిని 150 సెం.మీ ఎత్తు ఉండాలని, పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌,  సైన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌పై రాత పరీక్ష ఉంటుందని, శారీరక పరీక్షలు ఉంటాయన్నారు. ఇతర సలహాల కోసం హవల్దార్‌ శేషయ్య 9177930360, మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయం 08542223468 నంబర్లను సంప్రదించాలని, వెబ్‌సైట్‌ www.tswreis.in నందు దరఖాస్తు చేసుకోవాలని ఆమె చెప్పారు.