శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Sep 19, 2020 , 06:22:17

నిరుద్యోగులకు ఉద్యోగా అవకాశాలు

నిరుద్యోగులకు ఉద్యోగా అవకాశాలు

వనపర్తి విద్యావిభాగం: నిరుద్యోగ యువతీ యువకులకు పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగా అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు మధుకర్‌స్వామి, నిర్వాహకులు భాస్కర్‌ తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు పదో తరగతి పాస్‌ లేదా ఐటీఐ, డిప్లొ మా, డిగ్రీ, బీటెక్‌, ఫార్మసీ, పీజీ పాసైనవారు హైదరాబాద్‌లోని కొ న్ని ప్రైవేట్‌ కంపెనీలలో ఉద్యోగ నియామకాల కోసం పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్‌వారు వారం రోజులపాటు ఉచిత శిక్షణ ఇచ్చి శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగ నియామకం కల్పించనున్నట్లు, నెలకు రూ.12 వేల నుంచి రూ.25వేల వరకు వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న మొదటి 50మందిని ఈనెల 23 హైదరాబాద్‌కు పంపుతామన్నారు. అర్హత, ఆసక్తిగల యువతీ యువకులు ఈ నెల 19 నుంచి 30 వరకు https://forms.gle/x9bjtr5wb chzu86a6 వెబ్‌సైట్‌ నందు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర సందేహాలకు 9542433427నంబర్‌ను సంప్రదించాలని కోరారు.