శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Sep 19, 2020 , 06:24:21

అభాగ్యులకు అండగా ప్రభుత్వం : మంత్రి

అభాగ్యులకు అండగా ప్రభుత్వం : మంత్రి

వనపర్తి : రేవల్లి మండలం కేశంపేట గ్రామానికి చెందిన గొల్ల అనురాధకు రూ. 2లక్షల విలువ గల పార్టీ ఇన్సూరెన్సు చెక్కును  మంత్రి నిరంజన్‌రెడ్డి తన గృహంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేశంపేట గ్రామానికి చెందిన గొల్ల కాశిం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేవాడని, ఇటీవల  ప్రమాదవశాత్తు మరణించడంతో అతని భార్యకు చెక్కును అందజేయడం జరిగిందని మంత్రి వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాకనాటి కృష్ణయ్య, చీర్ల సత్యంసాగర్‌ తదితరులు ఉన్నారు. 

మదనాపురంలో..

మదనాపురం : ఆపత్కాలంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉందని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వడ్డెరాములు అన్నారు. నర్సింగాపురం గ్రామానికి చెందిన బిట్లి ఓంకార్‌కు రూ.22వేలు, కొన్నూరు గ్రామానికి చెందిన గోపాల్‌గౌడ్‌కు రూ. 26వేలు, అదే గ్రామానికి చెదిన వడ్డె జమ్ములుకు రూ.20వేల చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైనట్లు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీపీ నివాసంలో బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేసారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చొరవతో సత్వర సహాయం అందుతున్నదని మండల ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కృష్ణయ్య, సర్పంచ్‌ రాంనారాయణ, నెలివిడి ఎంపీటీసీ కుర్మయ్య, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్‌ హనుమాన్‌రావు, కో-ఆప్షన్‌ సభ్యులు చాంద్‌పాషా, టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామాధ్యక్షుడు సత్యం యాదవ్‌, మండల ప్రచార కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు అచ్యుతరెడ్డి, నాగన్నయాదవ్‌, బిట్లి యాదగిరి, సాయిలు, తాతయ్య, నాగేంద్రం, తిరుపతయ్య, సత్యం, రవికుమార్‌ పాల్గొన్నారు.