ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Sep 19, 2020 , 06:24:24

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

కొత్తకోట : సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తకోట, మదనాపురం మండలాల్లోని ఆయా పాఠశాలలకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడంతో వారిని శుక్రవారం కొత్తకోట పట్టణంలోని జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌ స్వగృహంలో ఆయన ఎంపీపీ గుంతమౌనిక, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పొగాకు సుకేశినితో కలిసి ఘనంగా సన్మానించారు. రెండు మండలాలకు సంబంధించి ఏడుగురు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం హర్షణీయమన్నారు. అప్పరాల పాఠశాలకు చెందిన దేవన్న, ముమ్మళ్లపల్లి పాఠశాలకు చెందిన శ్రీలక్ష్మి, రాయినిపేట పాఠశాలకు చెందిన రమేష్‌గౌడ్‌, దంతనూర్‌ పాఠశాలకు చెందిన లక్ష్మీనారాయణరెడ్డి, తిరుమలాయపల్లి పాఠశాలకు చెందిన రాంచంద్రయ్య, మదనాపురం పాఠశాలలకు చెందిన కల్పన, మహేందర్‌గౌడ్‌ను సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా శేఖర్‌గౌడ్‌ వహించారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జయమ్మ, సీడీసీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్‌, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసులు, వార్డు కౌన్సిలర్లు సంద్యరాణి, పద్మమ్మ, రాంమోహన్‌రెడ్డి, రాములుయాదవ్‌, నాగన్నసాగర్‌, కో-ఆప్షన్‌ సభ్యులు మిషేక్‌, వసీంఖాన్‌, సింగిల్‌విండో డైరెక్టర్లు, మార్కెట్‌ డైరెక్టర్లు, నాయకులు అయ్యన్న, సుభాష్‌, కటికె శ్రీను, మంద ప్రశాంత్‌, వినోద్‌సాగర్‌, హనుమంతుయాదవ్‌, వికాస్‌, ఉపాధ్యాయ సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.