బుధవారం 21 అక్టోబర్ 2020
Wanaparthy - Sep 19, 2020 , 02:32:44

గెలుపే లక్ష్యంగా పని చేయాలి

గెలుపే లక్ష్యంగా పని చేయాలి

  • ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి టౌన్‌ : త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పని చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభు త్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు.

ప్రజలకు పారదర్శక పాలన అం దించేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ఏకకాలంలో గురుకులాలు, కళాశాలలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అన్ని ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎ స్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, గ్రంథాలయ చైర్మన్‌ లక్ష్మయ్య, ఉద్యోగుల సంఘం నాయకుడు వేణుగోపాల్‌నాయుడు ఉన్నారు. 


logo