మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Wanaparthy - Sep 16, 2020 , 01:01:47

పాలమూరు అభివృద్ధే నా అభిమతం

పాలమూరు అభివృద్ధే నా అభిమతం

  • అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దుతా
  • రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో నిలుపుతా
  • పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం
  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరు అభివృద్ధే  నా అభిమతంపాలమూరు అభివృద్ధే నా అభిమతం.. అన్నిరంగాల్లో ముందుంచి రాష్ట్రంలోనే నెంబర్‌వర్‌ స్థానంలో నిలుపుతానని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ, టీచర్స్‌ కాలనీ, మర్లు, పాల్కొండలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, డివైడర్‌ పనులను ఆయన ప్రారంభించారు. అలాగే వడ్డెర బస్తీలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులకు జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 

- మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ 

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ : ‘పాలమూరు అభివృద్ధే నా అభిమతం.. రో డ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధితో సుందరంగా తీర్చిదిద్దుతా.. అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్‌ స్థానంలో నిలుపుతా’.. అని ఎక్సైజ్‌, క్రీ డా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నా రు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జి ల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ, టీచ ర్స్‌ కాలనీ, మర్లు, పాల్కొండలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, డివైడర్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పద్మావతి కాలనీలోని వడ్డెర బస్తీలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులను జ డ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన త ర్వాత సీఎం కేసీఆర్‌ విద్యుత్‌, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృ షి చేశారన్నారు. తాను మొ దటి సారి ఎ మ్మెల్యేగా గెలిచి న తర్వాత కౌన్సిలర్లతో కలిసి ప్రతి వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకొని పరిష్కరించామని చెప్పారు. గతంలో పాలమూరు పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడేవారని, తర్వాత మిషన్‌ భగీరథ ద్వారా నీటి సమస్య శా శ్వతంగా దూరమైందన్నారు. మహబూబ్‌నగర్‌ -జడ్చర్ల రోడ్డు పనులతోపాటు జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ చేపట్టి, చౌరస్తాలను విస్తరించి పట్టణానికి న యా లుక్‌ తీసుకొస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే మ యూరీ పా ర్కు అభివృద్ధి చేశామని, దేశం లో ఎక్కడా లేని విధంగా కేసీఆర్‌ ఎకో పా ర్కును అభివృద్ధి చే యనున్నట్లు తెలిపారు. ప్రతి వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. బైపాస్‌ పరిసర ప్రాంతాల్లోని భూము విషయంలో కొందరు మోసం చేశారని తమ దృష్టికి తీసుకొచ్చారని, ఎవరనేది తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

వ్యాధుల నిర్మూలనకు డ్రైవ్‌


 జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన పారిశుధ్య, సీజనల్‌ వ్యాధుల నిర్మూలన డ్రైవ్‌ను కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సేవలు అభినందనీయమన్నారు. కరోనా సమయంలో ధైర్యంగా విధులు నిర్వర్తించారన్నారు. సైనికులు దేశం కోసం ఎలా సేవ చేస్తున్నారో.. ము న్సిపల్‌ కార్మికులు, వైద్యశాఖ సేవలు అ లాంటివే అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్ర శంసించారు. కార్యక్రమాల్లో అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ పవర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌, ఎంఈ సత్యనారయణ, మలేరియా అధికారి విజయ్‌కుమార్‌, కౌన్సిలర్లు కట్టా రవికిషన్‌రెడ్డి, నీరజా విఠల్‌రెడ్డి, నరేందర్‌, అనంతరెడ్డి, ము న్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు అర్షద్‌అలీ, మాజీ కౌన్సిలర్‌ విఠల్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, అంజద్‌ తదితరులు పాల్గొన్నారు.


logo