శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Sep 16, 2020 , 01:01:45

టీబీ డ్యాంకు నిలకడగా వరద

టీబీ డ్యాంకు నిలకడగా వరద

అయిజ: కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద నిల కడగా కొనసాగుతున్నది. ఎగువన తుంగ జలాశ యంతోపాటు నదీతీర ప్రాంతాల నుంచి 8,710 క్యూసెక్కుల వరద వస్తున్నది. మంగళవారం టీబీ డ్యాంలోకి ఇన్‌ఫ్లో 12,212, అవుట్‌ఫ్లో 11,972 క్యూసెక్కులు నమోదైంది. 100.855 టీఎంసీల సామర్థ్యం గల టీబీ డ్యాంలో 100.855 టీఎంసీలు నిల్వ ఉన్నది. 1633 అడుగుల నీటి మట్టానికి 1633.00 అడుగులు ఉన్నట్లు డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు.

ఆర్డీఎస్‌ ఆనకట్టకు..

కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. మంగళవారం ఆనకట్టకు 20,631 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 20వేల క్యూసెక్కులు వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన సుంకేసుల బ్యారేజీకి చేరుతుండగా, ఆర్డీఎస్‌ ఆయకట్టుకు 631 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఈఈ రామయ్య తెలిపారు. ఆర్డీఎస్‌ ఆనకట్టలో 10.7 అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.