మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Sep 15, 2020 , 08:26:54

అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు

అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు

వనపర్తి రూరల్‌ : అంగన్‌వాడీ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం మానుకోవాలని కోరుతూ జిల్లా తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ అంగన్‌వాడీ వ్యవస్థలకు ముగిం పు పలుకుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన 2020 జాతీయ వి ద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి పద్మ, ప్రాజెక్టు క మిటీ అధ్యక్షుడు జ్యోతి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి,భారతి,రాజు పాల్గొన్నారు.