సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Sep 09, 2020 , 04:29:14

నేడు ‘సురవరం’ విగ్రహావిష్కరణ

నేడు ‘సురవరం’ విగ్రహావిష్కరణ

  •  హాజరుకానున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రముఖులు 

  వనపర్తి : గోల్కొండ పత్రిక సంపాదకుడు, వనపర్తి తొలి శాసనసభ్యుడు సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సంతబజారులో వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని కార్యక్రమ నిర్వాహకులు బలరాం,  గుంటి గోపి, వీరయ్య, నారాయణరెడ్డి, భీంపల్లి శ్రీకాంత్‌, సుబ్బయ్య, దాసరి రంగ, సు ధాకరాచారి ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా.. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా విగ్రహావిష్కరణ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ఆచార్య ఎస్వీ రామారావు, ఎల్లూరి శివారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, మామిడి హరికృష్ణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కుర్ర జితేంద్రబాబు, డాక్టర్‌ చెన్నయ్య  హాజరవుతారని వారు తెలిపారు. ఆయనపై రచించిన సువరం తెలంగాణ సంచిక, సురవరం మొగ్గలు (కవితా సంకలనం) కూడా ఆవిష్కరించనున్నారు. జిల్లాలోని కవులు, రచయితలు, అభిమానులు పా ల్గొనాలని వారు కోరారు.