మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Sep 08, 2020 , 02:39:21

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

వనపర్తి : బాల్‌శక్తి, బాల్‌ కల్యాణ్‌ పురస్కారాల కోసం అర్హులైన పిల్ల లు, వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి నర్సయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు క్రీడలు, కళలు, వివిధ అంశాలలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన పిల్లలకు బాల్‌శక్తి పురస్కారంతోపాటు రూ.లక్ష నగదును, మెడల్‌, సర్టిఫికెట్‌తో 2021 జనవరి 26వ తేదీన ప్రధానమంత్రి చేతుల మీదుగా అందజేయనున్నట్లు ఆయన తెలిపా రు. అభ్యర్థులు నేరుగా కాకుండా www.nca.wcd.nic.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.