మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Sep 08, 2020 , 02:39:24

ప్రజావాణికి 11 ఫిర్యాదులు

ప్రజావాణికి 11 ఫిర్యాదులు

  • ఎస్పీ అపూర్వరావు 

వనపర్తి : జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 11 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా ఎస్పీ మాట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో 6 భూ సం బంధిత ఫిర్యాదులు, 3 పరస్పర గొడవలు, 2 భార్యాభర్తలకు సంబ ంధించిన ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను ఆయా మండలాల ఎస్సైలకు పంపించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలను తీసుకోవాలని సూచించినట్లు ఆమె తెలిపారు.