శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Sep 05, 2020 , 04:43:54

ఆడపిల్లలని.. అంతమొందించాలని..

ఆడపిల్లలని.. అంతమొందించాలని..

  • అప్పుడే పుట్టిన బిడ్డలకు పురుగు మందు పోసి పరారైన తండ్రి
  •  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  •  నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  •  దవాఖానలో శిశువుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి

మహబూబ్‌నగర్‌/కోస్గి టౌన్‌/గండీడ్‌: ఆడ పిల్లలు పుట్టారని వారి భారం మోయలేనని కన్నతండ్రి కసాయిలా మారి అప్పుడే పుట్టిన శిశువులకు పురుగులు మందు తాగించిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గండీడ్‌ మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన గొల్ల కేశవులుకు మూడు సంవత్సరాల కిందట మద్దూర్‌ మండలం కొమ్మూర్‌ గ్రామానికి చెందిన కృష్ణవేణితో వివాహమైంది. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. అప్పటికే నిరాశతో ఉన్న కేశవుల..భార్య కృష్ణవేణి రెండో కాన్పు కోసం ఈనెల 1న కోస్గి పట్టణంలోని బాలాజీ దవాఖానలో చేరింది. ఆమెకు అదే రోజురాత్రి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తండ్రి కేశవులు మళ్లీ ఆడపిల్లలు పుట్టారని భారంగా భావించి, పుట్టిన గంటకు వారిని అంతమొందించేందుకు పథకం రచించాడు. భార్య నిద్రలో ఉన్న సమయంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు ఆ పసిపాపలకు తాగించి మీ తెలియనట్లు బయటకు వెళ్లాడు. అంతంలోనే బయటకు వెళ్లిన పసి పాపల అమ్మమ్మ భారతమ్మ వచ్చి పిల్లలను చూడగా వారి నోట బురుగులు రావడంతో తల్లి కృష్ణవేణితో కలిసి వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు.

పరీక్షించిన వైద్యులు పిల్లలకు పురుగుల మందు పోసినట్లు గమనించి వెంటనే మహబూబ్‌నగర్‌లోని రవి చిన్న పిల్లల దవాఖానకు తరలించారు. ఈ విషయమై కృష్ణవేణి తల్లి భారతమ్మ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు దవాఖానలో సీసీ కెమెరాల ఆధారంగా పురుగులమందు తండ్రే వెంటతీసుకువచ్చి పసిపాపలకు తాగించినట్లు నిర్ధారించి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈనెల3న దవాఖానకు వచ్చిన కేశవులును పోలీసులు పట్టుకొని కేసునమోదుచేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్న శిశువులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరిశీలించారు. నిందితున్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

హెర్సిస్‌ వైరస్‌ ద్వారా పశువులకు సోకుతున్న లంపీస్కిన్‌ వ్యాధి అతి ప్రమాదకరంగా మారుతున్నది. 

వైరస్‌ సోకిన పశువుల్లో 104 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

పశువుల ముక్కు, కండ్ల నుంచి నీరు కారడం, నోటి నుంచి చొంగకారడంతోపాటు చర్మం కింద పెద్దపెద్దగా కణతులు వస్తున్నాయి. 

[ ఈ కణతులు క్రమంగా పుండుగా మారి చర్మంపై బొబ్బలుగా వచ్చి వాటి నుంచి చీము, రక్తం కారడం మొదలవుతుంది. 

[ పశువుల నోటి నుంచి పుండ్లు కావడంతో ఆహారం తీసుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. 

వ్యాధి లక్షణాలతో పశువులు పూర్తిగా బలహీనపడిపోయి పాల ఉత్పత్తి తగ్గిపోయి  చనిపోయే అవకాశాలున్నాయి. 

ఈ వ్యాధి కీటకాలు, స్రావాలు, కలుషిత వాతావరణమైన గాలి ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుంది. 

ఆరోగ్యకరమైన పశువు శరీరంలోకి వైరస్‌ ప్రవేశించిన 4 నుంచి 14 రోజుల్లో లక్షణాలు బయటపడుతున్నాయి. 

మరణాలు సంభవించలేదు..

జిల్లాలో 390 పశువులకు లంపీస్కిన్‌ వ్యాధి సోకింది. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పాడి రైతులకు తగిన సూచనలు అందిస్తున్నాం. పశువులు బలహీనపడుతున్నాయే.. కానీ ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు. మందుస్తు జాగ్రత్తగా ప్రభుత్వ సూచన మేరకు గోట్‌ పాక్స్‌ టీకాలను వేస్తున్నాం. ఈ టీకా వలన వ్యాధి పూర్తిగా నయంకానప్పటికీ 50 శాతం వరకు నిరోధించగలుగుతున్నాము. అన్ని మండలాల్లో పశువైద్యాధికారులు సిద్ధంగా ఉన్నారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. పాడిరైతులు పశువుల పాకను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

- వెంకటేశ్‌, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి, వనపర్తి

పశువులకు ఒకదాని నుంచి మరోదానికి లంపీస్కిన్‌ వ్యాధి సోకుతున్నది. వనపర్తి జిల్లాలో ఇప్పటికే వందల సంఖ్యలో పశువులకు వ్యాధి సోకడంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంటు వ్యాధి సోకకుండా ఉండేదుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు చేపడుతున్నది. పాడి రైతులు లంపీస్కిన్‌ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి సోకకుండా ఉండేందుకు నివారణనే ప్రస్తుతానికి సరైన మందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. వ్యాధి సోకకముందే గోట్‌ పాక్స్‌ టీకాను వేయించాలంటున్నారు. పశువుల పాకలో కలుషిత వాతావరణం లేకుండా శుభ్రత పాటిస్తే వ్యాధి పశువులకు సోకుండా జాగ్రత్త పడొచ్చు.

390 కేసులు నమోదు.. 

వనపర్తి జిల్లాలో పాడిపశు సంపద రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. జిల్లా వ్యాప్తం గా పుష్కలంగా సాగునీరు అందుతుండటంతో పశుగ్రాసానికి కొదవ లేకుండా ఉన్నది. మారుతున్న ఈ పరిణామాలతో రైతులు పశుసందను అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వం అందించిన ఉచిత సబ్సిడీ గొర్రెలతో గొర్రెల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని 12 మండలాల్లో ఆవులు 75,089, గేదెలు 72,531, గొర్రెలు 9,76,832, మే కలు 80,608, పందులు 8,922 ఉన్నాయి. ఈ క్రమంలో లంపీస్కిన్‌ అంటు వాధి పశువులను బలహీనపరుస్తున్నది. ఇప్పటికే 390 పశువులకు వ్యాధి సోకినట్లు అధికారులు తెలిపారు. వీటన్నింటినీ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు నిత్యం పరిశీలిస్తూ వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు చేపడుతున్నారు.