సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Aug 27, 2020 , 06:34:37

రెవెన్యూ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

రెవెన్యూ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

వనపర్తి : మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించే రెవెన్యూ మేళా ను పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని  మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి  కోరారు. బుధవారం వనపర్తి మున్సిపాలి టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ మేళా కార్యక్రమానికి  38 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇంటి పన్ను సవరణ గురించి 25, పేర్ల సవరణ గురించి 9, ఇంటి నెంబర్‌ గురించి 2 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే సమస్యలను పరిష్కరించి దరఖాస్తుదారులకు న్యాయం చేస్తామని వివరించారు.