బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Aug 27, 2020 , 06:34:39

రైతులతోపాటు వ్యాపారులకూ రుణాలు

రైతులతోపాటు వ్యాపారులకూ రుణాలు

వనపర్తి రూరల్‌ : వనపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలు అందజేసేందుకు కృషి చేస్తామని సహకార వ్యవసాయ సంఘం చైర్మన్‌ వెంకట్రావ్‌ అ న్నారు. బుధవారం సంఘం ఆధ్వర్యంలో చిన్న వ్యాపారులకు రూ. 25లక్షల రుణాలను చైర్మన్‌ వెంకట్రావ్‌ అందజేశారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి సహకార వ్యవసాయ పరపతి సంఘంలోని రైతులతోపాటు చిన్న వ్యాపారసంస్థలకు రుణాలు అం దజేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే దాదాపు 25 మందికి రూ.లక్ష చొప్పున రుణాలు మంజూరు చేశామన్నారు. కార్యక్రమం లో సహకార సంఘం సీఈవో గోపాల్‌, సిబ్బంది మనోహర, మాజీ మండలాధ్యక్షుడు మాణిక్యం, లక్ష్మీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.