మంగళవారం 27 అక్టోబర్ 2020
Wanaparthy - Aug 18, 2020 , 03:13:56

ముంపు గ్రామాలను సందర్శించిన ఎస్పీ

ముంపు గ్రామాలను సందర్శించిన ఎస్పీ

తాడ్వాయి ఆగస్టు17: ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ సోమవారం తాడ్వాయి మండలంలోని వరద ముంపు గ్రామాలైన మేడారం, ఊరట్టంను సందర్శించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల జంపన్న వాగుతో పాటు వాగులు పొంగి పొర్లడంతో ఈరెండు గ్రామాల పొలిమేరలు వరద నీటితో నిండి పోయి జలదిగ్బంధమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్పీ వరద  ప్రాంతాలను సందర్శించి, స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏ సమయంలోనైనా పోలీసులు అందుబాటులో ఉంటారని, అందోళన చెందవద్దని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ వెంట ములుగు ఏఎస్పీ సాయి చైతన్య, పస్రా సీఐ శ్రీనివాస్‌, తాడ్వాయి ఎస్సై జీ రవీందర్‌ తదితరులున్నారు.

జంట వంతెనలపై చెత్త తొలిగింపు 

మేడారంలోని జంట వంతెనలపై పేరుకుపోయిన చెత్తను సోమవారం సర్పంచ్‌ చిడం బాబురావు ఆధ్వర్యంలో తొలగించారు. వరద నీరు వంతెనల పైనుంచి ప్రవహించడంతో ఎగువ ప్రాంతాల నుంచికొట్టుకు వచ్చిన చెట్లు, చెత్త పేరుకుపోవడంతో సర్పంచ్‌ జేసీబీ సాయంతో ట్రాక్టర్ల ద్వారా వేరే ప్రాంతాలకు తరలించారు. ఆయనవెంట కార్యదర్శి సతీశ్‌, సిబ్బంది ఉన్నారు. 


logo