శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Aug 16, 2020 , 02:14:53

అభివృద్ధిలో అగ్ర‌గామి

 అభివృద్ధిలో అగ్ర‌గామి

n సాగునీరిచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తా

n మొక్కలు నాటి వనాలపర్తిగా మారుస్తాం

n వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

n వనపర్తిలో నిరాడంబరంగా పంద్రాగస్టు వేడుకలు

వనపర్తి, నమస్తే తెలంగాణ: కలెక్టర్‌ కార్యాలయం ఆవర ణలో 74వ స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా దృష్ట్యా జిల్లా ఉన్నతాధికారులు, కొందరు ప్రముఖులు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యారు. ఉదయం 10గంటలకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా రు. అనంతరం జిల్లా అభివృద్ధిని వివరిస్తూ ప్రసంగించారు. వచ్చే పంద్రాగస్టు నాటికి జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ ద్వారా అన్ని చెరువులకు నీరు చేరేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ ఏడాది జూరాల ద్వారా 69,975 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించామన్నారు. రాజీవ్‌ భీమా ఎత్తిపోతల ద్వారా ఇప్పటివరకు 2.351టీఎంసీల నీటిని ఎత్తిపోసి 128 చెరువులు నింపామన్నారు.

ఈ పథకం ద్వారా 64,977 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు. ఎంజీకేఎల్‌ఐ ద్వారా 49 చెరువులకు పంపిణీ చేసి 27,232 ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు. మిషన్‌ కాకతీయ ద్వారా 974 చెరువులు ఎంపిక చేసి 800 చెరువుల్లో పనులు పూర్తి చేస్తామని 10 చెక్‌ డ్యాంలు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ. 316కోట్లతో మిషన్‌ భగీరథ పనులు చేపట్టి ఇప్పటివరకు రు.206కోట్లు ఖర్చు చేశామన్నారు. వ్యవసాయశాఖ తరఫున 71 రైతు వేదికలు నిర్మించేందుకు రూ.15కోట్ల 62లక్షలు మంజూరు చేసి పనులు చేపట్టామన్నారు. రైతుబంధు 1,42,716 మంది రైతుల ఖాతాల్లో రూ.175 కోట్ల 45లక్షలు జమచేశామన్నారు. రూ. 30కోట్లతో జిల్లాలో 11 వ్యవసాయ మార్కెట్‌ గోదాంలను నిర్మించామన్నారు. పశుసంవర్ధక శాఖ తరఫున 100 గ్రామాల్లో  18,938 పశువులకు కృత్రిమ గర్భోత్పత్తి పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది 1,254 చెరువుల్లో 2.51కోట్ల చేపపిల్లలు వదిలామన్నారు. కరోనా సోకిన వారికి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు 1750 రెమిడివియర్స్‌ ఇంజక్షన్లు 4,500 ఫాబిఫ్లూ మందులను సరఫరా చేశామన్నారు. హరితహారం ద్వారా ఈ ఏడాది 47లక్షల 63వేల 600 మెక్కలు నాటేలా లక్ష్యాన్ని విధించుకున్నామన్నారు.

అనంతరం రూ.10వేల చొప్పున  వీధివ్యాపారుల కోసం మంజూరైన నిధులను మెప్మా ద్వారా అందించారు. వనపర్తి మున్సిపాలిటీకి మంజూరైన 8 ట్రాక్టర్లను, గ్రామపంచాయతీలకు మంజూరైన రెండు ట్రాక్టర్లను అందించారు. జిల్లా కేంద్రంలో రూ.48.94లక్షలతో సఖీ కేంద్ర భవనం నిర్మించేందుకు భూమిపూజ చేశారు.  కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌బాషా, అడిషనల్‌ కలెక్టర్లు శ్రీవాత్సవ, వేణుగోపాల్‌, ఏఎస్పీ షాకిర్‌ హుస్సేన్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు