గురువారం 03 డిసెంబర్ 2020
Wanaparthy - Aug 15, 2020 , 07:12:47

పెబ్బేరును ఆధునీకరిస్తాం

పెబ్బేరును ఆధునీకరిస్తాం

మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్ల ఘనత సీఎం కేసీఆర్‌దే..

l వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

l పెబ్బేరు మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం

l కాంగ్రెస్‌కు చెందిన మాజీ వార్డుసభ్యులు జమ్ములమ్మతో సహా 20మంది మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక

పెబ్బేరు పట్టణాన్ని ఆధునీకరంగా తీర్చిదిద్దుతామని, సంతను కూడా అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలక మండలి ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌ కమిటీ పాలకమండలిలో రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీఆర్‌ఎస్‌ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 

- పెబ్బేరు

పెబ్బేరు: పెబ్బేరు పట్టణాన్ని అత్యంత ఆధునీకరంగా తీర్చిదిద్దుతానని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలక మండలి ప్రమాణస్వీకార మహోత్సవానికి మంత్రి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన నూతన మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మంగరాయి శ్యామలమన్యం, వైస్‌ చైర్మన్‌ దాడి కృష్ణకుమార్‌రెడ్డిలతో పాటు పాలకమండలి ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకమండలిలో రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీఆర్‌ఎస్‌ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అందులో భాగంగానే పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా గిరిజన వర్గానికి చెందిన ఆడపడుచు మంగరాయి శ్యామలను పదవి వరించిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కట్టుబడిందన్నారు. పట్టణానికి వారంతపు సంత గుండెకాయలాంటిదని, ఇట్టి స్థల వివాదంలో వస్తున్న వదంతులను ఎవ్వరూ నమ్మొద్దన్నారు. సంతను మరింత ఆధునీకరణంగా మారుస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకురాలు, మాజీ వార్డు మెంబర్‌ జమ్ములమ్మ తమ అనుచర వర్గంతో కలిసి దాదాపుగా 20మంది మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈకార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణశ్రీ, వైస్‌ చైర్మన్‌ కర్రెస్వామి, జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ శైలజ, వైస్‌ ఎంపీపీ బాలచంద్రారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌ గౌని బుచ్చారెడ్డి, విశ్వరూపం, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు రాములు, శంకర్‌నాయుడు, మాజీ ఎంపీటీసీ కట్ట శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.