శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Aug 14, 2020 , 01:23:51

పదిరోజుల పాటు మాంసం విక్రయాలు బంద్‌

పదిరోజుల పాటు మాంసం విక్రయాలు బంద్‌

ఆత్మకూరు : కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలో పదిరోజుల పాటు మాంసం విక్రయాలు బంద్‌ చేయాలని ఎంపీడీవో ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 నుంచి 24 వరకు మటన్‌, చికెన్‌, చేపలు విక్రయించకూడదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ పదిరోజులు పవిత్ర పర్యూషన్‌ పర్వదినాలను పాటించనున్నట్లు, ఈ నేపథ్యంలో దేశం మొత్తంగా మాంసం విక్రయాలు నిలిచిపోతున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లోనూ మాంసం విక్రయదారులు గమనించి సహకరించాలని కోరారు. ఈ పదిరోజుల్లో ఎక్కడైనా మాంసం విక్రయాలు చేసినా వారి పై చర్యలు ఉంటాయని తెలిపారు. దీనికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు.